రిలీజ్ ముందే ఆన్ లైన్ లో ఫుల్ మూవీ..!

-

కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలను పైరసీ నుండి కాపడటానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక పైరసీ చేస్తే ఓకే కాని తమిళ్ రాకర్స్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. లేటెస్ట్ గా తమిళరాకర్స్ దెబ్బకు ఎల్.కే.జి సినిమా బలైపోయింది. ఆర్కే బాలాజి, ప్రియా ఆనంద్ కలిసి నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైర్ గా వస్తుంది.

అయితే సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీని ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్ చేశారు. ఈ లీక్ విషయం తెలుసుకున్న నెటిజెన్లు ఇప్పటికే సినిమాను డౌన్ లోడ్ చేస్తున్నారు. చిత్రయూనిట్ చొరవతో సైబర్ పోలీసులు రంగంలో దిగడంతో ఆ లింక్ తొలగించారట. సినిమా వ్యాపారానికి దెబ్బ తీస్తున్న ఇలాంటి పైరసీ వెబ్ సైట్స్ వల్ల పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news