మేషరాశి: ప్రతికూలం. అనారోగ్యసమస్యలు, ధనవ్యయం. ఈరాశి వారు నవగ్రహప్రదక్షణలు, శివారాధన చేసుకోండి.
వృషభరాశి: వస్తులాభం, దేవాలయ దర్శనం, కుటుంబంలో సంతోషకర వాతావరణం. ఈరాశివారు శనిత్రయోదశి పూజ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
మిధునరాశి: స్నేహితుల వల్ల లాభం, అధిక ఖర్చులు, విందులు, వినోదాలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతారాధన చేయండి.
కర్కాటకరాశి:ప్రభుత్వ మూలక ఇబ్బందులు, అనారోగ్య సూచన, చిన్నచిన్న సమస్యలు. విష్ణు ఆరాధన, శనివార నియమం పాటించండి. తులసీ చెట్టుకు నమస్కారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
సింహరాశి: బంధు సఖ్యత, ధననష్టం, మనఃశాంతి ఉండదు. పరిహారాలు శివారాధన, గోవిందనామస్మరణ మంచి చేస్తుంది.
కన్యారాశి: వ్యాపారలాభం, స్త్రీ సౌఖ్యం, అధికారుల వల్ల విభేదాలు. పరిహారాలు శనిత్రయోదశి పూజ చేసుకోండి. మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వీలుంటే పూజ చేసుకోండి.
తులారాశి: స్త్రీమూలక కార్యజయం, శత్రుభయం, చిన్నచిన్న సమస్యలు. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణలు, హనుమాన్ చాలీసా పఠనం/శ్రవణం చేయండి.
వృశ్చికరాశి: ప్రతికూల వాతావరణం, ఇబ్బందులు. పరిహారం మీకు ఏలినాటి శనినడుస్తుంది. వీలైతే శనిత్రయోదశి పూజ చేసుకోండి లేదంటే పేన ఆర్టికల్‌లో పేర్కొన్న విధంగా చేయండి.
ధనస్సురాశి: మనఃశాంతి, శుభకార్యలాభం, బంధు సఖ్యత. పరిహారాలు ఇష్టదేవతారాధన. శనిత్రయోదశి పూజ చేసుకోండి. ఏలినాటి శనికి శాంతి చేకూరి మీకు మంచి జరుగుతుంది.
మకరరాశి: ఏలినాటి శని శాంతి కోసం శని త్రయోదశి పూజ చేసుకోండి. వ్యవహారాలు అనుకూలం.
కుంభరాశి:విహార యాత్రలు, దూరప్రయాణ సూచన, అనవసర వ్యయం. పరిహారాలు ఇష్టదేవతారాధన.
మీనరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు, అధికశ్రమ, నిదానంగా పనులు. పరిహారాలు ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం,ప్రదక్షణలు మంచి ఫలితాలు ఇస్తాయి.
నోట్: శని త్రయోదశికి సంబంధించిన వివరాలు ఏ రాశివారు ఏ విధంగా పూజ చేసుకోవాలి. వీలుకాని వారు ఏం చేయాలి పైన ఐటమ్‌లలో ఉంది చదవండి. నమ్మకంతో ఆచరించి సత్ఫలితాలను పొందండి. ఓం నమో వేంకటేశ్వరాయనమః
– కేశవ