పెసలు సాయి దేవాలయాల్లో ప్రసాదంగా సమర్పించండి! ఏప్రిల్ 3 రాశిఫలాలు

మేషరాశి : మిశ్రమంగా ఉంటుంది. పనులు పూర్తి, చేసే పనుల్లో లాభం, గౌరవం, వ్యాపారంలో ఆటంకం.
పరిహారాలు: పెసలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే సాయిబాబా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి పంచిపెట్టండి.

వృషభరాశి : కార్యజయం, చేసేపనిలో లాభం, చేసేపనిలో లాభం, పనులు పూర్తి.
పరిహారాలు: పసుపు పూలతో అమ్మవారికి/తెల్ల పూలతో సరస్వతిదేవికి పూజచేయించుకోండి.

మిథునరాశి : మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్యం, జయం, అనుకోని మార్పులు, ధననష్టం.
పరిహారాలు: పెసలు నానపెట్టి సాయిబాబా దేవాలయంలో ప్రసాదంగా నివేదించి, అందరికీ పంచండి.

03 April 2019 Wednesday Horoscope

కర్కాటకరాశి : మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, ధనలాభం, వస్త్రలాభం. పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: అయ్యప్పస్వామి దేవాలయ దర్శన, పూజ చేయించుకోండి.

సింహరాశి: మిశ్రమం, ధననష్టం, అకారణ విరోధాలు, పట్టుదల అధికం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: పెసలు నానబెట్టి సాయిదేవాలయంలో ప్రసాదంగా సమర్పించి భక్తులకు పంచండి.

కన్యారాశి : వ్యవహార లాభం, రాజకీయ రంగంలో వారికి లాభం, కుటుంబ సఖ్యత, ఆనందం.
పరిహారాలు: బుధవార నియమం లేదా పొంగలి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి.

తులారాశి : మంచి ఫలితాలు, పనులు పూర్తి, సంతోషం, ధనలాభం.
పరిహారాలు: సాయి/గురు సంబంధ దేవాయల సందర్శన

వృశ్చికరాశి : వ్యతిరేక ఫలితాలు, వ్యసనాలతో ఖర్చు, వివాదాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: దుర్గాదేవికి చండీదీపారాధన/అష్టోతర పూజ లేదా పుష్పమాల సమర్పణ చేయండి.

ధనస్సురాశి : మిశ్రమం. బాకీలు వసూలు కావు, ధనం సరైన సమయానికి అందదు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.
పరిహారాలు: అమ్మవారి దేవాయల దర్శన, పూజ, పుష్పమాల సమర్పణ చేసుకోండి.

మకరరాశి : మంచి ఫలితాలు, విందులు, వినోదాలు, ఆకస్మిక ధనలాభం, పనుల్లో వేగం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: బుధవార నియమం, సరస్వతి దేవికి పూజ, తెల్లని వస్త్రధారణ చేయండి మేలు చేస్తుంది.

కుంభరాశి : అన్నింటా అనుకూలం. పనులు పూర్తి, కార్యలాభం, ధనవ్యయం, విందులు, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: సాయిబాబా దేవాలయ దర్శన, హారతి సేవలో పాల్గొనడం మంచిది.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, ఇబ్బందులు, బంధువుల రాక, మిత్రుల కలయిక, పనుల్లో జాప్యం.
పరిహారాలు: మాసశివరాత్రి అభిషేకం, గణపతి పూజ చేయండి పనుల్లో జాప్యం జరుగదు.

-కేశవ