ఈరాశివారు శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది!
మేషరాశి: ధనలాభం, కార్యజయం, పనులు సజావుగా సాగిపోతాయి. ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు.
వృషభరాశి: ఆదాయం వృద్ధి, నూతన వ్యక్తుల పరిచయం, మిత్రుల సహకారం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణ చేయండి.
మిథునరాశి: మనో ఉత్సాహం, మంచి ఫలితాలు ఉంటాయి, దూర ప్రయాణ సూచన, పరిహారాలు ఇష్టదేవతరాధన చేసుకోండి.
కర్కాటకరాశి: ప్రతికూల వాతావరణం, శతృబాధలు, పనుల్లో జాప్యం. పరిహారాలు శివాభిషేకం, విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం.
సింహరాశి: మిశ్రమ ఫలితాలు, చికాకులు, బంధువులతో పట్టింపులు, చిన్నచిన్న వివాదాలు. పరిహారాలు నవగ్రహప్రదక్షణలు, వీలైతే శని పూజ చేసుకోండి.
కన్యారాశి: ప్రతికూలమైన రోజు, అనవసర వివాదాలు, మాటపట్టింపులు. పరిహారాలు శనికి పూజ, ఆంజనేయస్వామి ఆరాధన లేదా చాలీసా పఠనం చేయండి మంచి జరుగుతుంది.
తులారాశి: లాభం, ప్రయాణాల వల్ల ఉపయోగం, విందులు, వినోదాలు. పరిహారాలు ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి: అన్నింటా నష్టం, ప్రతికూలమైన రోజు, కొన్ని విషయాలలో అనుకూల వార్తలు వింటారు.పరిహారాలు నవగ్రహపూజ లేదా ఆంజనేయస్వామికి భక్తితో 11 ప్రదక్షణలు చేయండి.
ధనస్సురాశి: లాభం, పనుల్లో అనుకూలత కాకపోతే చిన్నచిన్న విషయాల వల్ల చికాకు వస్తుంది. విందు, బంధువులతో లాభం. పరిహారాలు శనికి అభిషేకం, పూజ లేదా చాలీసా పఠనం చేయండి.
మకరరాశి: ప్రతికూలమైన రోజు, ఆకస్మిక ధననష్టం, విరోధాలు. పరిహారాలు నేడు శనిత్రయోదశి తప్పనిసరిగా వీలైతే శనికి తైలాభిషేకం చేయించండి. నల్లనువ్వులు, ఉప్పుతో అభిషేకం చేస్తే చాలా మంచిది. కుదరనివారు చాలీసాను భక్తితో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి.
కుంభరాశి: అశాంతి, కలహాలు, విరోధాలు. పరిహారాలు నవగ్రహ పూజ లేదా శివాభిషేకం చేయించుకోండి.
మీనరాశి: కార్యదీక్ష, విజయం, పనులు పూర్తి. ప్రభుత్వ మూలక లాభం. పరిహారాలు గోసేవ లేదా ఇష్టదేవతరాధన చేయండి.
– కేశవ