సీన్ లోకి క్రిష్ వచ్చాడు..!

-

అక్కినేని అఖిల్ హీరోగా చేసిన మూడు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకోలేదు. అఖిల్, హలో సినిమాల ఫలితాలు నిరాశ పరచగా రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్నుతో డెఫినెట్ గా హిట్ కొడతాడని అనుకున్నారు కాని అది కూడా ఆశించిన అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బజ్ బాగున్నా సినిమా కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ఆడియెన్స్ పెదవివిరిచారు.

ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో సినిమా ఆడుతున్న థియేటర్ కవర్ చేస్తూ కలక్షన్స్ పెంచే పనిలో ఉన్న అఖిల్ తన తర్వాత సినిమా శ్రీను వైట్ల డైరక్షన్ లో చేస్తాడని అంటున్నారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ మరో ఫ్లాప్ డైరక్టర్ తో ఎలా సినిమా ఒప్పుకున్నాడంటూ అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

శ్రీను వైట్ల ప్లేస్ లో క్రిష్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది. అఖిల్ కెరియర్ మీద బెంగ పెట్టుకున్న నాగార్జున ఈసారి అఖిల్ బాధ్యతను క్రిష్ మీద పెట్టాడట. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేసిన క్రిష్ కథానాయకుడుతో నిరాశపరచినా మహానాయకుడుతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా అఖిల్ తర్వాత సినిమా మాత్రం క్రిష్ చేతుల్లో పెట్టేశాడట నాగార్జున. మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news