4 జనవరి 2019 శుక్రవారం మీ రాశి ఫలాలు

-

మేషరాశి: సంతానానికి ఆరోగ్యం, బంధు,మిత్రుల రాక, అధికవ్యయం శుభ ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి.


వఋషభరాశి:అధిక ధనవ్యయం, వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం, మనోదుఖఃం వీటికోసం శివపూజా లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.


మిధునరాశి: విజయం, ఆనందం, ప్రయాణ అవకాశాలు, వ్యాపారులకు ఇబ్బందులు, సంతానానికి శుభసూచకాలు. మంచి ఫలితాలు పొందడానికి దుర్గాదేవికి పూజచేసుకోండి. వీలైతే చండీదీపారాధన చేయండి.


కర్కాటకరాశి:ఉద్యోగులకు అనుకూల సమయం, కీర్తినష్టం, వాహనాలు నడిపేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలలో కూడా విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా తీసుకెళ్లాలి. మంచి ఫలితాల కోసం దుర్గా, లక్ష్మీ పూజ చేయండి. వీలుకానివారు కనీసం అమ్మవారి కుంకుమ ధరించి పనులు ప్రారంభించుకోండి.


సింహరాశి: ఈ రాశివారికి పనులయందు బద్దకం, ఆకస్మిక ప్రయాణ సూచన, వ్యాపారులకు సామన్యంగా ఉంటుంది. కుటంబంలో మాటపట్టింపు వచ్చే అవకాశం. వీటి పరిహారానికి విష్ణు సంబంధిత పూజ లేదా స్ర్తోత పఠనం చేయండి.


కన్యారాశి: కొత్త పనులకు స్వీకారం లేదా వాటికి సంబంధించిన చర్చలు, అదాయ పెరుగుదలకు సూచన, అలంకార కోసం వ్యయం, చిన్నచిన్న లాభాలు. మంచి ఫలితం కోసం అమ్మవారికి పూజ లేదా కుంకుమ ధరించి పనులు చేసుకోండి.


తులరాశి:నూతన వస్త్రలాభం, బంగారు ఆభరణాలు కొనుగోలుకు అవకాశం, శారీరక శ్రమ, కొత్తపనులు ప్రారంభించడానికి మంచి సమయం. లక్ష్మీదేవికి అర్చన చేయండి మరింత విశేషంగా ఉంటుంది.


వఋశ్చికరాశి:శుభకాలం, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం, మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం. మంచి ఫలితాల కోసం రాహుకేతు శ్లోకాలు చదువుకోండి. లేదా నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.


ధనస్సురాశి:వాహన ఇబ్బందులు, పనులలో బద్దకం, ప్రయాణ సూచనలు, సమస్యలు వస్తాయి. వాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. మంచి ఫలితాల కోసం ధశరథ విరచిత శని స్తోత్రం, దుర్గాదేవికి పూజ మంచి చేస్తుంది.


మకరరాశి:మంచి సమయం, సోదరీసోదర సహకారం, ప్రభుత్వ పథకాల వల్ల లేదా అధికారుల వల్ల లాభ సూచన, నూతన వస్త్ర లేదా వస్తు లాభం. మంచి ఫలితాల కోసం సూర్య నమస్కారం చేసుకోండి.


కుంభరాశి:ధనలాభం, సేవింగ్స్ చేసే అవకాశం, బంధుమిత్రలతో సంతోషంగా గడుపుతారు,గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి ఫలితాల కోసం ఇష్టదేవాతారాధన చేసుకోండి.


మీనరాశి:కార్యజయం, పట్టుదలతో పనులు చేస్తారు, సంతోషంగా గుడుపుతారు, అప్పులు వసూలు అవుతాయి. మంచి ఫలితాల కోసం అమ్మవారికి అర్చన లేదా నమస్కారం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news