బాబు పర్యటనపై అనుమతిస్తూనే …ఆంక్షలు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రధాని నరేంద్ర మోదీ మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటోంది. నేరుగా ప్రధాని మోదీయే చంద్రబాబుని ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏటా మాదిరిగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు దావోస్ వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే బాబు దావోస్‌ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ… ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. దీనికి తోడు ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా… నలుగురికే అనుమతి ఇచ్చింది.

వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. విదేశీ పర్యటనకు కేంద్ర అనుమతిస్తూనే ఆంక్షలు విధించడాన్ని తెదేపా తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నడు లేని విధంగా షరతులు విధించడం విడ్డూరంగా ఉందన్నారు

Read more RELATED
Recommended to you

Latest news