డిసెంబర్‌ 14 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

కార్తీకమాసం- డిసెంబర్‌- 14- సోమవారం. అమావాస్య.

మేషరాశి:శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈ రోజు పనులు అనుకూలంగా సాగుతాయి. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. మీపని, శ్రమ వలన మీరు ప్రమోషనలు పొందుతారు. మీరు మీవ్యాపారవిస్తరణకు అనుభవంగలవారి నుండి సలహాలు కోరతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కోసం పేద ప్రజలకు ఆహార పదార్తాలు ఇవ్వండి.

 

todays horoscope

వృషభరాశి:ఆఫీస్‌లో అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు. ఆఫీస్‌లో అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఈరోజు విందులు, వినోదాలకు హాజరవుతారు. చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారస్తులకు ఒత్తిడులు తొలగుతాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన సమయాన్నిఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

పరిహారాలుః శుభ ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్ర నామాలను పారాయణం చేయండి.

 

మిధునరాశి:ఎవరికి అప్పులు ఇవ్వకండి !

ఈరోజు వ్యవహారాలలో ప్రతికూలతలు ఉంటాయి. ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  అనారోగ్య సూచన జాగ్రత్త. అన్ని చోట్ల మీపై ఒత్తిడులు ఉంటాయి.  వ్యాపారాలకు నిరాశాజనకంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీరుద్రాభిషేకం చేయించండి. అనుకూలంగా ఉంటుంది.

 

కర్కాటకరాశి:దేవాలయాలను సందర్శిస్తారు !

ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఈరోజు మీరు చేసే మదుపు అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం కావు అంతే ఉంటాయి. ఆఫీస్‌లో అనుకూత వున్నప్పటికీ వత్తిడి మాత్రం పెరగుతుంది. ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, నిదానంగా నడుస్తాయి. సోదరులు లేదా సోదరీలు ఆర్థిక విషయంలో సహకారం అందిస్తారు దీంతో కొంత ఉపశమనం లభిస్తుంది

పరిహారాలుః అనుకూలమైన శుభపలితాల కోసం శ్రీశివకవచం పారాయణం చేయండి.

సింహరాశి:అనుకోని మార్గాల ద్వారా ఆదాయం !

ఈరోజు మీకు అనకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో పెద్దవారి సహకారం లభిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. పెద్దల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శివాలయంలో దీపారాధన చేయండి.

కన్యారాశి:వివాదాల నుంచి విముక్తి !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. ఈరోజు పాతస్నేహితుల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. వివాహం కోసం చూస్తున్నవారికి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దూరపు  బంధువులను కలుసుకుంటారు. ఈరోజు వాహనయోగం. వివాదాల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభిస్తాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః మంచి శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

తులారాశి:ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు వత్తిడిని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. పెద్దల సలహాలను తీసుకుంటే సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, నిరాశ పరుస్తాయి. అనారోగ్య సూచన.

పరిహారాలుః అత్యంత శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పారాయణం, ప్రదక్షణలు చేయండి.

 

వృశ్చికరాశి:అనవసర ఖర్చులు పెరుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. కానీ ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. మీ ఇంటికి అనుకోని అతిథిలు రాకతో బిజీగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొందరికి దూరప్రయాణాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు. చేసే పనుల్లో నెమ్మదితనం వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగవు.

పరిహారాలుః శ్రీవిష్ణుపారాయణం చేయండి.

ధనుస్సురాశి:కొత్త పనులకు శ్రీకారం !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో మంచిగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం. ఈరోజు దూరపు ప్రదేశాల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. చేసే పనులలో మరింత అనుకూలస్థితి.

పరిహారాలుః శ్రీఅనుకూలమైన ఫలితాల కొరకు శివపంచాక్షరీ జపం చేయండి.

మకరరాశి:ఆటంకాలు, చికాకులు తప్పవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో మీకు ఊరట లభిస్తుంది. కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు.  అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాలలో వ్యతిరేకత, ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలకు అనుకోని చికాకులు వస్తాయి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః అనుకూలమైన ఫలితాల కోసం రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి:అధికారుల ప్రశంసలను అందుకుంటారు !

ఈ రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. వైవాహికంగా సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీరామమంత్రాన్ని మంత్రాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

మీనరాశి:ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగ సంబంధ వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు మీరు అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. కుటుంబసభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. వ్యాపారాలు అంతగా ముందుకు సాగవు. వైవాహిక జీవితంలో స్తంభన, స్వల్పమైన సమస్యలు వస్తాయి.

పరిహారాలుః  అమావాస్య ఈరోజు మూడు నిమ్మకాయలను సాయంత్రం లేదా రాత్రి సమయంలో తిప్పివేసి కాళ్లుకడుగుకుని శివపంచాక్షరీని జపించండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news