ఫిబ్రవరి 11 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ ఫిబ్రవరి – 11 – పుష్యమాసం- గురువారం.

 

మేష రాశి:ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందక ధననష్టం జరుగుతుంది. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీదనే దృష్టిని కేంద్రీకరించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు చేయడంతో కష్టాలు ఏర్పడతాయి. ఈరోజు ప్రయాణాలు అనుకూలించవు.

పరిహారాలు: నవగ్రహారాధన చేయండి, దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి.

 

todays horoscope

వృషభ రాశి:మిత్రులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక వత్తిడికి గురవుతారు. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరపు ఖర్చులు చేయడంతో నష్టం జరుగుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.

పరిహారాలు: దుర్గా దేవి ఆరాధన చేయండి.

 

 మిధున రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడడం మంచిది. ఆహార మితం లేకపోవడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వాహనాలను ప్రమాదాలు. అప్పుల బాధలు పెరగడంతో ఇబ్బంది పడుతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.

 పరిహారాలు: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిన చేయండి.

 

కర్కాటక రాశి:మొండి బాకీలు వసూలు చేసుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి  విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందడంతో ధన వృద్ధి కలుగుతుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు శ్రమకు తగా ఫలితం వుంటుంది.

పరిహారాలు: ఆవుకు పశుగ్రాసం పెట్టండి.

 

సింహరాశి:పెట్టుబడులు వల్ల లాభాలు !

ఈరోజు బావుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఖర్చులకు  దూరంగా ఉండడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రుల అవుతారు. శత్రు నాశనం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. విందు వినోదాలకు హాజరవుతారు.

పరిహారాలు: ఈరోజు మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యాన్ని పూర్తిగా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. గృహ స్థలాలన్ని కొనుగోలు చేస్తారు.పేదలకు సహాయం చేస్తారు.

పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:కుటుంబ సభ్యులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు వ్యక్తులకు సహాయం చేయడం  వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండడం మంచిది. సోదర సోదరీ మణులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఇతర విషయాల మీద శ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు, ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పోగొట్టుకున్న వస్తువులను, డబ్బును ఈరోజు పొందుతారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: బాల త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి:ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు బాగుంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు.

పరిహారాలు: ఈరోజు మార్కండేయ స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజంతా సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

  కుంభరాశి:ప్రయాణాలు అనుకూలంచవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు అనుకూలంచవు. అనవసరపు విషయాలు చర్చించక పోవడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలంగా లేదు. తొందరపడి ఎవరినైనా నమ్మడం వల్ల మోసపోతారు.

పరిహారాలు: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోని పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన లాభం కలుగుతుంది. స్నేహితులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. అనారోగ్యాన్ని తగించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. వాక్చాతుర్యం వల్ల  అందరి ఆదరణ పొందుతారు. సోదర సోదరీ మణులతో కలిసి మెలిసి ఉంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూరు. ప్రయాణాలకు అనకులం. వివాహాది నిశ్చయ తాంబూలాలకు అనుకూలం.

పరిహారాలు: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

– శ్రీ

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...