ఫిబ్రవరి 16 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ మాఘమాసం – ఫిబ్రవరి – 16 –  మంగళవారం.

 

మేష రాశి:వ్యాపారాలో అధిక లాభాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, అందరితో ఆనందంగా ఉంటారు. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉంటారు. కార్య లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.  మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనారోగ్యాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన యోగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహాది నిశ్చయతాంబూలాలకు అనుకూలం. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. దైవనామస్మరణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మీకు సహాయపడే వారు దూరమవుతారు. ప్రయాణాలకు అనుకూలం. వ్యసనాలకు దూరంగా ఉండండి. తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం వల్ల ఇబ్బందులు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 కర్కాటక రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల విద్య మీద శ్రద్ధ వహించలేక పోతారు. అనవసరపు వ్యక్తులతో పరిచయాలు నష్టాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమాదాలు ఏర్పడతాయి. కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల చికాకులు ఏర్పడతాయి.

పరిహారాలుః శివారాధన చేసుకోండి, దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడికి బిల్వ దళాలను సమర్పించుకోండి.

 

సింహరాశి:కష్టానికి తగ్గ ఫలితం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కష్టానికి తగ్గ ఫలితం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తక్కువ మాట్లాడడం మంచిది, మాట జారడం వల్ల నష్టం కలుగుతుంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తొందరపడి చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలుః ఈరోజు శివాష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని  తిరిగి పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మానసిక ఒత్తిడికి లోనవుతారూ. అనవసరపు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల నష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఆస్తి పంపకం విషయాల్లో విభేదాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలకు అనుకూలం. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోని విద్యను నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:ఆనందంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. మీ గృహంలో వేడుకలు జరుపుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను విస్తరించు కొంటారు, అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈరోజు బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ కళాశాలలో సీట్లు పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. యాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.

పరిహారాలుః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు బాగుంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం కలుగుతుంది. బంధుమిత్రులను కలుసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత పదవులు పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

 మీన రాశి:బాకీలు వసూలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...