విశాఖలో తీవ్ర ఉద్రిక్తత… టీడీపీ నేత దీక్ష భగ్నం

Join Our Community
follow manalokam on social media

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు తెల్లవారుజామున ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఆరు రోజులుగా పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇక ఆయన దీక్ష భగ్నం చేయడానికి వచ్చిన పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది.

ఈరోజు పల్లా శ్రీనివాసరావుని పరామర్శించడానికి చంద్రబాబు విశాఖపట్నం రానున్నారు ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షను భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస రావుని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ దాదాపుగా అన్ని పార్టీలు విడివిడిగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...