ఫిబ్రవరి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ పుష్యమాసం – ఫిబ్రవరి – 9-  మంగళవారం.

 

మేష రాశి:కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకోవడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. అందరినీ ఆకట్టుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన అధిక ధనలాభం పొందుతారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారూ. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.

పరిహారాలుః ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:సోదరుల మధ్య విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులను చేయడం వలన నష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న కోపం వల మీరంటే ఇష్టపడేవారు దూరం అవుతారు. వాహన ప్రమాదాలు. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఎదుటి వారి మీద ఆధార పడడం వల నష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః దుర్గాదేవిని ఆరాధించండి.

 

 మిధున రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అప్పుల బాధలు తగ్గిపోయి ధనవృద్ధి పెరుగుతుంది. ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు బదిలీ అవుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. వివాహాది నిశ్చయతాంబూలాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:మిత్ర లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. అనవసరపు ఖర్చులు చేయకుండా  ఉండటం వల ధనవృద్ధి పెరుగుతుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల నష్టం జరుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టక పోవడం మంచిది. తల్లిదండ్రుల మాట వినడం వల్ల అంతా బాగుంటుంది. చెప్పుడు మాటల వల్ల మోసపోతారు.

పరిహారాలుః శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

కన్యారాశి:కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఇతరులను నమ్మడం వల మోసపోతారు. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయకపోవడం వల ప్రమాదాలు ఏర్పడతాయి. అప్పుల బాధలు పెరగడం వల నష్టం. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వలన నష్టాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలించవు.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు చేయండి.

 

తులారాశి:స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి సరైన సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. భగవంతుని ధ్యానం వల్ల అన్ని అనుకూలిస్తాయి. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండడం వల ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలుః ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం వల అధిక లాభాలు కలుగుతాయి. సమయానికి డబ్బులు వసూలు చేసుకోవడం వలన ధనవృద్ధి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక ధనలాభం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి అవకాశాలను అందుకుంటారు, పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. వాయిదా పడ్డ పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఉన్నత విద్యలకు అర్హులవుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తొందరపాటు తనం వల్ల పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...