జనవరి 20 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

జనవరి – 20 – పుష్యమాసం – బుధవారం.

మేష రాశి:ఈరోజు ఆఫీసులో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికీ అనవసరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. తల్లిదండ్రులను కలవకుండా పనులు చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు సంకష్ట హర గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి, ఉండ్రాళ్ళ చేసే గణపతికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు పోటీపరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. ధణ వృద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. స్నేహితుల నుంచి ఆదరణ పొందుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు బాగా చదువుకుంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఏ పనినైనా వాయిదా వేయకుండా ముందుకు సాగి పోవడం వల్ల బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోమరితనం వదిలి పెట్టడం వల్ల అంతా బాగుంటుంది. వివాహా నిశ్చయత చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపార వృత్తుల వారికి లాభాలు కలుగుతాయి. ఇంతకు ముందు ఏవైనా వస్తువులు పోగొట్టుకుంటే తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కర్కాటక రాశి:ఈరోజు లాభాలు పొందుతారు !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. అనారోగ్యం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మీ మాటతో అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. వ్యాపారాలను విస్తరించుకొని లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. మొండి బాకీలు వసూలు కాక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. మిత్రులను కూడా శత్రువులుగా చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థలు చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కనక వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన లాభం పొందుతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి అంతా బాగుంటుంది.

 

 తులారాశి:ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగం   పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో ప్రమోషన్లు పొందుతారు. ఆస్తి పంపకాలు లాభాలు కలిగిస్తాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. నదీ స్నానం చేసుకుని అవకాశం ఉంది.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:దేవాలయ దర్శనం చేసుకుంటారు !

ఈ రోజు మామూలుగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఒకరు కాకుండా ఇతరులతో కలిసి ప్రయాణం చేయడం మంచిది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది, వంటరిగా ఒక్కరే బయటకు పోకుండా ఇతరులతో కలిసి పోవడం మంచిది. అనవసరపు వ్యక్తులతో అనవసరపు సంభాషణ చేయడం మంచిది కాదు.

పరిహారాలుః దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఆహార విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. వివాహ సంబంధ చర్చల కు అనుకూలమైన రోజు కాదు, వాయిదా వేసుకోవడం మంచిది. మీలో ఉన్న బాధను తల్లిదండ్రులతో పంచుకోవడం వల్ల బాధలు తగ్గిపోతాయి. స్వర్ణాభరణాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు  చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మకర రాశి:పోగొట్టుకున్న డబ్బును పొందుతారు !

ఈ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు ఉత్తమ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఈరోజు సమస్యలు తొలగిపోతాయి !

ఈరోజు   మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.  మాట తీరు వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎవరికీ అప్పులు ఇవ్వడం మంచిది కాదు. తక్కువగా మాట్లాడడం మంచిది. గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరపు విషయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది, స్వల్ప లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఎంతో ఆనందకరంగా వుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు గొప్ప పేరున్న, కళాశాలలో సీటు సంపాదించుకుంటారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల ధనయోగం కలుగుతుంది. ఇంతకు ముందు పోయిన ఉద్యోగము ఈరోజు తిరిగి పొందుతారు.

పరిహారాలుః నారాయణ కవచం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...