జనవరి 23 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం- జనవరి – 23- శనివారం.

 

మేష రాశి:ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిడి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా, ఏ పనిలో అయినా తొందర పడకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవ్వరికి మాట ఇవ్వడం చేయకుండా ఉండడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు క్రొత్త క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల వృద్ధి చెంది లాభాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. మొండి బాకీలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ధన లాభం పొందుతారు. ప్రయాణాలకు మంచి రోజు. స్థిరాస్తుల సంక్రమించే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉంది చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. మీ వాహనాలను, వస్తువులను ఎవరికి ఇవ్వకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని మొండి బకాయిలను వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వివాహ సంబంధ చర్చలకు అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఉన్న చాలారకాల ఇబ్బందుల నుంచి ఈరోజు బయట పడతారు. ఎంత కష్టమైన పనినైనా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు, కార్యసిద్ధి పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో ప్రమోషన్లు పొందుతారు.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఈరోజు వ్యాపారాలు విస్తరించుకొని లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు సరిదిద్దు కుంటారు ఆరోగ్య విషయంలో బాగుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, అయిన వారితో సఖ్యతగా ఆనందంగా, బాధ్యతగా ఉంటారు.

 పరిహారాలుః దుర్గా దేవి ఆరాధన చేసుకోండి.

 

తులారాశి:ధన నష్టం జరిగే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరగడం వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను వినడం మంచిది, చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగస్తులకు పని వత్తిడి వలన మానసిక ప్రశాంతత కోల్పోయే  అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విభేదాలకు దూరంగా ఉండడం మంచిది. మంచి వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః శ్రీ లలితా పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

వృశ్చిక రాశి:ఈరోజు పరిచయాలు పెంచుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విహార యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. గృహ స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకున్న పనులు సమయానికి  పూర్తి చేసుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారంలో క్రొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా, ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీ భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు లాభాలు కలుగుతాయి !

ఈరోజంతా అదృష్టంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. వైద్యుల చికిత్సా లేకుండానే ఆరోగ్యం నయమవుతుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. వ్యాపార పురోగతి వృద్ధి చెంది లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొండి.

 

 మకర రాశి:ఈరోజు సోదరులతో కలిసిమెలిసి ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ ఉద్యోగాలు పొందుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. సమాజంలో మీ మాటకు గౌరవం పెరిగి అందరూ ఆదరిస్తారు. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

 

కుంభరాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా తొందరపడకుండా చేయడం మంచిది. మాట తీరు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయంగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ విషయాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు. ఏ పని చేసినా అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news