ఈరోజు ఈ రాశివారికి ఆర్థిక నష్టాలు..ఉద్యోగాలలో వివాదాలు..

-

జూలై 9 న ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం: ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి.ఆర్థికంగా బలం చేకూరుతుంది.. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.

వృషభం: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.కొత్త రుణ బాధలు తీరతాయి..

మిథునం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు.వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..ఆలోచనలు అంతగా కలిసి రావు..జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సన్నిహితుల నుండి ఒత్తిడులు..ఈరోజు అంత మంచి రోజు కాదు..

సింహం: ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఈరోజు ఇంటాబయట మంచి పేరు ఉంటుంది.

కన్య: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకు పరుస్తాయి.కొన్ని సమస్యలు బాధిస్తాయి..

తుల: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు..అనుకొని ఆర్థిక లాభాలు వస్తాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.సన్నిహితుల నుంచి ఒత్తిడులు..

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు మీకు అండగా నిలుస్తారు. మీ సత్తా చాటుకునే రోజు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.నూతన ఉద్యోగాలు లభిస్తాయి..ఈరోజు శుభవార్తలు వింటారు.

కుంభం: సన్నిహితులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.అనుకున్న ఫలితాలు ఫలించవు..

Read more RELATED
Recommended to you

Latest news