జూన్ 13 రాశిఫలాలు : వేంకటేశ్వరస్వామికి తియ్యని ప్రసాదాన్ని సమర్పిస్తే ఈ రాశులకు శుభం!

మేషరాశి : అరోగ్యం బాగుంటుంది, ఇతరుల కోసం ఎక్కువ ఖర్చుపెడుతారు కుటుంబ సభ్యులతో విబేధాలు తొలగించుకోవడం ద్వారా లక్ష్యసాధన, మీ కృషి ఫలించేరోజు, భాగస్వామితో సాధారణ జీవితం, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, కందుల నైవేద్యం మంచి ఫలితాన్నిస్తుంది.

వృషభరాశి : సరదా స్వభావంతో ఇతరులకు సంతోషం, ఆర్థికపరిస్థితులు అనుకూలం, కుటుంబంలో సంతోషం, సోదరుల సహకారం, భాగస్వామి కోసం ఖర్చు పెడుతారు. వృత్తిలో ప్రతికూలత.
పరిహారాలు: పాలు, బియ్యం కలిపి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించండి వృత్తిలో మెరుగుదల కన్పిస్తుంది.

June 13th Thursday daily Horoscope

మిథునరాశి : సంతానంతో సంతోషం, వినోదాలకు, విలాసాల కోసం ఖర్చు చేస్తారు, కుటంబ సహకారం తక్కువగా ఉంటుంది, వృత్తిలో సాధారణం, ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి తియ్యని ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి : అదృష్టాన్ని నమ్ముకోకండి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి, పెడింగ్ పనులు పూర్తి, కొత్త ప్రదేశాలకు ప్రయాణం, వైవాహిక జీవితంలో ఓర్పుతో ఉండండి, వృత్తిలో ప్రతికూల పరిస్థితులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, తియ్యని నైవేద్యం సమర్పణ మీ దోషాల తీవత్రను తగ్గించి మంచి చేస్తుంది.

సింహరాశి : ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు, భాగస్వామితో ఆనందం, కుటుంబంలో సంతోష వాతావరణం, ప్రేమవిషయాలు అనుకూలం.వృత్తిలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ఎరుపు రంగు దుస్తుల ధారణ వల్ల మంచి జరుగుతుంది.

కన్యారాశి : మితిమీరి తినడం మానండి, ఇంటి గురించి పొదువు చేయండి, ఆఫీసులో అనుకూల వాతావరణం, వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

తులారాశి : ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా లాభాలు, దూరపు బంధువుల ద్వారా శుభవార్తా శ్రవణం, తోటి సిబ్బందితో ప్రేమపూరిత వాతావరణం, భాగస్వామితో అనుకూలం.
పరిహారాలు: రాగి ఉంగరం లేదా కడియం ధరించండి మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి : స్నేహితుల కలయిక, ప్రశంసలు, అనుకోని బిల్లులు, ఖర్చు పెరుగుతుంది. ప్రయోజనకరమైన రోజు, వస్తునష్టం, భాగస్వామితో అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
పరిహారాలు: పెద్దల పట్ట గౌరవం మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది.

ధనస్సురాశి : అత్యుత్తమమైన రోజు, ఆర్థిక విషయాలు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, నిపుణుల,అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి, కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు,భాగస్వామితో ఆహ్లాదకర సాయంత్రం.
పరిహారాలు: ఎరుపు వస్త్రధారణ, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మకరరాశి : మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది, ఆర్థికస్థితి మందకొడిగా ఉంటుంది, భాగస్వామితో అహ్లాదకరమైన రోజు, వృత్తిలో అనుకూలం, కుటుంబంలో శుభకార్య సూచన, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

కుంభరాశి : మీ కోసం ఇతరులను బలవంతం పెట్టవద్దు, అవసరాల గురించి ఆలోచిస్తే మీకు తగిన లాభం చేకూరుతుంది. కుటుంబంలో సంతోషం, భాగస్వామితో ఇబ్బంది, ఆరోగ్యం కోసం తప్పక జాగ్రత్త తీసుకోవాల్సిన రోజు, వాహనాలతో జాగ్రత్త, వృత్తిలో మంచి సమయం, బిజీ షెడ్యూల్.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తియ్యని ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి తప్పక మంచి జరుగుతుంది.

మీనరాశి : విహార యాత్రలు, గెట్‌టూగెదర్, అధిక ఖర్చులు, ఆర్థికంగా జాగ్రత్త, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, కుటుంబ సంతోషం, వృత్తిలో అత్యంత జాగురూకతతో ఉండాల్సిన రోజు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, కందులు నైవేద్యం సమర్పిస్తే దోష ప్రభావం తగ్గుతుంది.

– కేశవ