బ్రేకింగ్‌: హీరో వ‌రుణ్ తేజ్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారి రాణిపేట వద్ద హీరో వరుణ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న‌ ఆడి కారు.. ఇండికా కారును ఢీకొట్టింది. వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో హీరో వరుణ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండికా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాల్మికి షూటింగ్ కోసం వరుణ్ కర్నూలు వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకున్నది.