మార్చి 06 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ మార్చి- 6 – మాఘమాసం – శనివారం.

మేషరాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా రకాల తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకోవడం చేస్తారు. ఈరోజు మీరు ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఉల్లాసంగా ఉంటూ ఇతరులను కూడా ఉల్లాసంగా ఉంచుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. లాభాలు కలుగుతాయి. స్త్రీలకు లాభం కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

todays horoscope

వృషభ రాశి:ధననష్టం జరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తికాక ఆటంకాలు కలుగుతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. వాయిదా పడతాయి. పొరపాట్లు చేయడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బందులు, అనవసర ఖర్చులు అధికం అవుతాయి. ధననష్టం జరుగుతుంది. అనవసర పనులు చేసే సమయాన్ని వృధా చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారులతో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాల మీద శ్రద్ధ వహించి చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.
పరిహారాలుః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధునరాశి:మానసిక ప్రశాంతత లభిస్తుంది !

ఈరోజు బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు కలుగుతాయి. ధర్మానికి, న్యాయానికి పద్ధతులకు ఆచారాలకు సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు.
పరిహారాలుః ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధనతోపాటు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి:ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉండదు. స్నేహితులు శత్రువులు అవుతారు. ప్రయాణాలు అనుకూలించవు. మీలో ఉన్న కోపతాపాలు, వివాదాలు మీ ప్రాణ స్నేహితులను దూరం చేస్తాయి. మీలో నీతి నిజాయితీ లోపించడమే వల్ల ఎదుటి వారు మిమ్మల్ని మోసం చేస్తారు. రహస్యాలను బయటకు చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి విద్యను నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతలు పెరిగి పోతాయి. ప్రశాంతత కోల్పోతారు.
పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని 108 వడలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి.

సింహరాశి:ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. పెద్దవారిని గౌరవిస్తారు. పెద్ద వారి ఆస్తులు మీకు సంక్రమిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ప్రయోగాలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి:ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత హోదాలను పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు. విద్యార్థులు మంచి జ్ఞాపకశక్తితో కష్టపడి బాగా చదువుకుంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అన్యోన్యంగా ఉంటారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.

పరిహారాలుః  ఈరోజు శ్రీచంద్రశేఖరాష్టకం పారాయణ చేసుకోండి.

వృశ్చిక రాశి:అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలు కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం జరుగుతుంది. బంధువులతో విభేదాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:శుభకార్యాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. సాంప్రదాయానికి పద్ధతులకు, ఆచారాలకు ప్రాధాన్యతనిస్తారు. సాంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి:ఈరోజు అనుకూలంగా లేదు.

డబ్బులు వచ్చినట్టే వచ్చి ఖర్చు అవుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు. అనుకున్న పనులను శ్రద్ధ పెట్టి చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వాయిదా పడతాయి. సమస్యలు తలెత్తుతాయి. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రాణ స్నేహితులు దూరమవుతారు. స్నేహితుల చెప్పిన మాటలు వినడం వల్ల మోసపోతారు. మిత్రద్రోహం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఆహారం వల్ల సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.
పరిహారాలుః ఈరోజు గురు దక్షిణామూర్తి స్వామి ని ఆరాధించండి.

కుంభరాశి:బంధువుల నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వచ్చిన మంచి అవకాశాలు చేజారిపోతున్నాయి. ప్రయాణాలు అనుకూలం. మీలో చికాకు వల్ల కోపం వల్ల నీకు సహాయం చేసేవారు దూరమవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
పరిహారాలుః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈ రోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలము. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల మోసపోతారు. స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.
పరిహారాలుః ఈరోజు శ్రీకార్త వీర్యార్జున పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...