మార్చి 17 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి 17 – పాల్గుణ మాసం – బుధవారం.

 

మేషరాశి:మిత్రులతో కలహాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను పెంచుకోవడం వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఈరోజు మిత్రులతో కలహాలు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఓం శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

 

todays horoscope

వృషభ రాశి:ప్రయాణాలకు అనుకూలం !

అప్రయత్న కార్యసిద్ధి. ఈరోజు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. మిత్రుల కలయిక. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధునరాశి:శుభవార్తలు అందుతాయి !

ఈరోజు అనుకూలగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. ఈరోజు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి. ఈరోజు ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:స్వల్ప నష్టాలు !

వ్యవహారాలు మందగిస్తాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. భార్య భర్తలు చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది పడతారు. ఇష్టదేవతరాధన చేయండి.

 

సింహరాశి:ప్రయోగాలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. 15 నిమిషాలు ప్రాణాయామం చేయండి.

 

కన్యరాశి:స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు రుణబాధలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. ఈరోజు కార్యాలయం లో అప్రమత్తంగా ఉండండి. ధన ప్రాప్తి పొందుతారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు స్థిరాస్తులు అనుకూలిస్తాయి. సరస్వతిదేవికి నైవేద్యం సమర్పించండి.

 

తులారాశి:శ్రమాధిక్యం !

ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. స్నేహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఆహర విషయంలో శ్రద్ధ వహించండి. “ఓం” 108 సార్లు ప్రశాంత మనస్సుతో స్మరించండి.

 

వృశ్చిక రాశి:వ్యాపార అభివృద్ధి !

ఈరోజు వ్యాపారం లో సానుకూల మార్పులు ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. స్నేహితుల సహకారం పొందుతారు. హనుమాన్‌ ఆరాధన చేయండి.

 

ధనుస్సురాశి:పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు కొత్త పనులు చేపడతారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. కార్యాలయం లో అప్రమత్తంగా ఉండండి. బంధువుల నుంచి శుభవార్తలు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. శివారాధన చేయండి.

 

మకరరాశి:ఆరోగ్య సమస్యలు !

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారం లో స్వల్ప నష్టాలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. జీవిత భాగస్వామి నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

 

కుంభ రాశి:శుభవార్తలు వింటారు !

ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ధన ప్రాప్తి పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతస్థాయి స్థానాన్ని పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శ్రీసూక్తపారాయణంతో లక్ష్మీదేవిని ఆరాధించండి.

 

మీన రాశి:సమస్యలు తగ్గిపోతాయి !

ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. భార్య భర్తలు కలిసి మెలిసి ఉంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. సమస్యలు తగ్గిపోతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.