మార్చి 19 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్చి – 19 – ఫాల్గుణ మాసం – శుక్రవారం.

మేష రాశి:కుటుంబంలో సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. చెప్పుడు మాటల వినడం వల్ల సమస్యలు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు.
పరిహారాలుః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి, సాయంత్రం సమయంలో శునకాలకు రొట్టె ముక్కలను వేయండి.

todays horoscope

వృషభ రాశి:పనులు పూర్తి !

ఈ రోజు బాగుంటుంది. ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. చేపట్టిన పనులను పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి:పరిచయాలు పెంచుకుంటారు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో నష్టం కలుగుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ధననష్టం కలుగుతుంది. పరిచయాలు పెంచుకుంటారు. ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదర సోదరీమణులతో వ్యతిరేకత ఏర్పడుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపించడం మంచిది.
పరిహారాలుః ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి:ధన లాభం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఆనంద పరుస్తుంది. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి:శుభకరంగా ఉంటుంది !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
పరిహారాలుః శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

…………………..
కన్యారాశి

కుటుంబ సౌఖ్యం !
ఈరోజు ఆనందకరంగా వుంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. కుటుంబం సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. గతంలో ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పరిహారాలుః కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి:ప్రయాణాలు వాయిదా !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. రహస్యాలు బయటకు చెప్పడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు, ఇబ్బందులు ఎదురవుతాయి.
పరిహారాలుః ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి 21 ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించండి.

వృశ్చిక రాశి:వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సలహాలు తీసుకుంటారు. మిత్ర లాభం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంటు ఉద్యోగం అవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కొని కొత్త ప్రాజెక్టు వర్కులు చేపడతారు. సమాజములో పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:కార్యసిద్ధి కలుగుతుంది !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన వృద్ధి కలుగుతుంది.
పరిహారాలుః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి:అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః లక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి:సోదరులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది.
పరిహారాలుః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి:వ్యాపారాలో లాభాలు !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. శత్రువులు కూడా స్నేహితులవుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారాలో లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు.
పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news