ఈ రోజు అపరాజితదేవికి పూజిస్తే సర్వశుభాలు! మే 12 రాశిఫలాలు

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, శుభకార్యాల వల్ల ధనం ఖర్చు, చిన్నచిన్న కలహాలకు అవకాశం, విందులు, వేడుకలు. ఆరోగ్యం, పనులు పూర్తి, ప్రయాణ సూచన
పరిహారాలు: అపరాజితా దేవిని పూజించండి. చక్కటి ఫలితాలు ఉంటాయి.

వృషభరాశి : సకల కార్యజయం, ఆనందం, విందులు,ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మిథునరాశి : వ్యవహారాలు అనుకూలం, బాకీలు వసూలు, భార్య తరపు వారితో సఖ్యత, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

కర్కాటకరాశి : మిశ్రమం. బంధువులతో చర్చలు, పనుల్లో జాప్యం. ఆరోగ్యం, చికాకు, ప్రయాణాలు అనుకూలించవు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి : ఆనందం, సోదరి ఇంటికి రాక, బంధువుల కలయిక, కుటుంబంలో సఖ్యత, ఆరోగ్యం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

కన్యారాశి : ఇబ్బందులు, అనుకోని ఖర్చులు, ప్రయాణాలు వాయిదా, పనుల్లో జాప్యం.
పరిహారాలు: అపరాజితా దేవిని అర్చన చేయండి సర్వశుభాలు కలుగతాయి.

తులారాశి : చేసే పనిలో ఇబ్బంది, ధనలాభం, ప్రయాణ సూచన, ఆరోగ్యం. పనుల్లో జాప్యం.
పరిహారాలు: అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి.

వృశ్చికరాశి : శుత్రజయం, ధనలాభం, వ్యాపారులకు అనుకూలం, విందులు. ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సురాశి : సంతోషం,ఆరోగ్యం, శుభమూలక ప్రయాణాలు, కుటుంబ సఖ్యత, బంధువుల రాక.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

మకరరాశి : వ్యతిరేక ఫలితాలు, కలహాలు,శత్రుభయం. విందులు, ప్రయాణాలు కలసిరావు.
పరిహారాలు: అపరాజితా దేవిని అర్చించండి. మంచి ఫలితం ఉంటుంది.

కుంభరాశి : కార్యజయం, కుటుంబ సఖ్యత, స్నేహితలతో ఆర్థిక లావాదేవీలు, విందులు
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి : సఖ్యత, ఆనందం,కార్యనష్టం, ప్రమాద సూచన, విందులు, వాహనాలతో జాగ్రత్త. పనులు జాప్యం.
పరిహారాలు: అపరాజితా దేవిని అర్చించండి. సర్వశుభాలు కలుగుతాయి.

– కేశవ