మే 23 రాశి ఫ‌లాలు : వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మామిడిపండ్లు దానం చేస్తే ఈరాశులకు సర్వం జయం!

మేషరాశి : పనిచేసేచోట విజయాలు, కుటుంబంలో శాంతి, సంతోషం, 1,8 లక్కీ నంబర్లు, ఎరుపు రంగు దుస్తులు ధరించండి.
పరిహారాలు- హనుమాన్‌ను పూజచేయండి మంచి ఫలితాలు వస్తాయి.

వృషభరాశి : వ్యతిరేక ఫలితాలు, ఆనారోగ్య సూచన, ఆందోళనలు, ఒత్తిడి, పనుల్లో జ్యాపం, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షణలు చేసి మామిడిపండ్లు దానం ఇవ్వండి మంచి జరుగుతుంది.

మిథునరాశి : మంచి ఆరోగ్యవంతంగా ఉంటారు, శారీరకంగా, మానసికంగా బాగుంటుంది. రచయితలకు కొత్త ఆలోచనలు వస్తాయి, సమావేశాలు కలిసివస్తాయి, సంతానంతో సంతోషం.
పరిహారాలు- పసుపు రంగు దుస్తులు ధరించండి, గణేషడుని పూజించండి.

కర్కాటకరాశి : అనుకూల ఫలితాలు, ఒత్తిడి లేని రోజుగా ఉండిపోతుంది, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, పనిచేసేచోట అనుకూలం, విజయం. ఆరోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

సింహరాశి : సంతోషకరమైన రోజు, గౌరవమర్యాదలు, సాంఘిక జీవనం, కుటుంబ సంతోషం, ఆరోగ్యం.
పరిహారాలు- దేవాలయ దర్శనం చేసి మామిడి పండ్లను దానం చేయండి.

కన్యారాశి : స్వల్ప అనారోగ్యం, అలసట, వ్యాపార అభివృద్ధి, జాగ్రత్తగా మెలగండి, ప్రయాణాలు తప్పనసరి కాకుంటే వాయిదా వేసుకోండి.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, మామిడి పండ్లు దానం చేయండి.

తులారాశి : ప్రయత్నకార్యసిద్ధి, పనిచేసేచోట అనుకూలం, శుభకార్య, దైవపూజలకు హాజరు, ప్రయాణాలు, అనవసర శ్రమ, సంతోషం.
పరిహారాలు- తెలుపు రంగు దుస్తులు ధరించండి, దుర్గామాతను ఆరాధించండి.

వృశ్చికరాశి : అధిక ఖర్చులు, మనసులో ఆందోళనలు, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణం, పనులు జాప్యం.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షణలు, మామిడిపండ్లు దానం చేయండి.

ధనస్సురాశి : శుభదినం, భవిష్యత్‌కు అనుకూలమైన పనులు చేస్తారు, సంతోషం, ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి, కుటుంబ సంతోషం, శుభకార్యాలకు హాజరు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, మాధవమాస దానాలు చేయండి.

మకరరాశి : అనుకున్నంత సజావుగా సాగదు, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి, పనిచేసే చోట ఏకగ్రతతో పనిచేయండి, ఆరోగ్యం, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, మామిడిపండ్ల దానం చేయండి.

కుంభరాశి : ఆర్థికంగా బాగుంటుంది, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, అనుకూలం, బంధువుల ద్వారా అనుకూల వార్తలు వింటారు. ప్రయాణాలు, ఆరోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మీనరాశి : వ్యాపారాలు అనుకూలం, కుటుంబ సంతోషం, ఆరోగ్యం, విద్యార్థులకు అనుకూలమైన రోజు, అనుకోని మార్పులు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు దీపారాధన చేయండి.

– కేశవ