మే 26 రాశి ఫ‌లాలు : రుద్రాభిషేకంతో ఈ రాశులకు సర్వ కార్యజయం!

మేషరాశి : వినోదాలు, కార్యజయం, మిత్రుల కలయిక, భార్యతో విందులు. ఆరోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

వృషభరాశి : ఆకస్మిక ధనలాభం, తండ్రితో విబేధాలు, ప్రభుత్వ మూలక కార్యజయం, ఆరోగ్యం.
పరిహారాలు- సూర్యారాధన చేయండి చక్కటి ఫలితాలు ఉంటాయి.

మిథునరాశి : విలువైన వస్తువులతో జాగ్రత్త, స్త్రీమూలకంగా ధనలాభం, పనుల్లో జాప్యం. ఆరోగ్యంలో మార్పులు. కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు- సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్యంలో అనుకూలత, కార్యజయం ఉంటుంది.

May 26th Sunday daily Horoscope

కర్కాటకరాశి : ఇంటి అలంకరణకు వస్తువులు కొంటారు, చికాకు, రుణం, ధననష్టం, కుటుంబంలో వాదాలు.
పరిహారాలు- ఈశ్వర/వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రదక్షణలు, దానాలు చేయండి.

సింహరాశి : ఊహించని మార్పులు, కుటుంబ సంతోషం, ఇంట్లో శుభకార్యాలు, జయం. ప్రయాణాలు కలసి వస్తాయి.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దీపారాధన సరిపోతుంది.

కన్యారాశి : స్థానమార్పులు, కార్యజయం, ఆదాయానికి లోటు ఉండదు, భార్య తరపు వారితో విందులు.
పరిహారాలు- సూర్యారాధన, దేవాలయ ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితాలు.

తులారాశి : భార్యతో విరోధం,కార్యనష్టం, ఆదాయానికి మించిన వ్యయం, పనుల్లో జాప్యం, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, మామిడిపండ్లు దానం చేయండి.

వృశ్చికరాశి : వ్యాపార ఆటంకాలు, అకాల విరోధాలు, సంతాన ఆరోగ్యంలో ఇబ్బందులు, కుటుంబ సఖ్యత, విందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు- సూర్య ఆరాధన చేయండి మీ పిల్లలకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.

ధనస్సురాశి : ఆకస్మిక మార్పులు, కుటుంబ సంతోషం, శుభకార్య జయం, ధనలాభం.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

మకరరాశి : అనుకున్నవి జరగవు, భార్యతో సుఖం, కుటుంబ సఖ్యత, విందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు– ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

కుంభరాశి : అనుమానాలు, పెద్దవారితో లాభం, కార్యజయం, అధికారుల కలయిక, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత. ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు- సూర్య ఆరాధన, మామిడిపండ్ల దానం చేయండి.

మీనరాశి : బ్యాంకు సమస్యలు, ధననష్టం, ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యంలో మార్పులు, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు– సూర్య ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

– కేశవ