జగన్.. అనితర సాధ్యుడు.. ఆయన రాజకీయ జీవితం.. యువతకు స్ఫూర్తిదాయకం..!

-

తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఏపీ సీఎం అయ్యే వరకు అంటే నిన్నటి దాకా ఆయన ప్రయాణం కత్తి మీద సాములా జరిగింది. ముళ్ల మీద నడకలా సాగింది. కానీ.. ఎక్కడా వెనుకడగు వేయలేదు. ఎక్కడా ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. ఒకటే లక్ష్యం.. ఒకటే.. ఒకటే.. ఒకటే.. అదే ఏపీకి సీఎం.. ఆ లక్ష్యమే.. ఆ కసే ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టింది.

తండ్రి అకస్మాత్తుగా వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి, చెల్లి, భార్య మాత్రమే తోడు. అందరూ ఒక్కడిని చేసి సతమతం చేశారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నో సమస్యలు సృష్టించారు.. అయినప్పటికీ.. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి.. తనను వేధించిన వారికి ఓటు ఆయుధంతో సరైన బుద్ధి చెప్పి.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఎదిగాడు. తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఏపీ సీఎం అయ్యే వరకు అంటే నిన్నటి దాకా ఆయన ప్రయాణం కత్తి మీద సాములా జరిగింది. ముళ్ల మీద నడకలా సాగింది. కానీ.. ఎక్కడా వెనుకడగు వేయలేదు. ఎక్కడా ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. ఒకటే లక్ష్యం.. ఒకటే.. ఒకటే.. ఒకటే.. అదే ఏపీకి సీఎం.. ఆ లక్ష్యమే.. ఆ కసే ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టింది. జగన్ మోహన్‌రెడ్డిని ఒక ముఖ్యమంత్రిలాగానే కాదు.. ఆయనలోని విభిన్న పార్శాలను మనం ఇప్పుడు టచ్ చేయాలి. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శపాయం. ఆయన అలుపెరగని కృషి ఎంతో మంది విద్యార్థులకు, యువకులకు దిశా నిర్దేశం. అందుకే.. ఆయన సీఎం స్థాయికి ఎదగడానికి పడ్డ కష్టాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం పదండి..

నిజానికి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నంత వరకు జగన్ మోహన్‌రెడ్డికి రాజకీయాలు తెలియవు. అప్పటి వరకు ఆయన సీఎం కొడుకే. అలాగే చెలామణి అయ్యాడు. కానీ.. ఆకస్మికంగా తండ్రి మరణం.. వైఎస్ కుటుంబాన్ని సంక్షోభంలో పడేసింది. రాష్ర్టానికే కాదు.. వైఎస్‌ఆర్.. ఆ కుటుంబానికి కూడా పెద్ద దిక్కే. కానీ.. సడెన్‌గా రాష్ర్టాన్ని, కుటుంబాన్ని ఆయన వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో అసలు కష్టాలు ప్రారంభం అయ్యాయి. దానికి తోడు.. వైఎస్‌ఆర్ ఏ పార్టీనైతే తన కన్న తల్లి కంటే అమితంగా ప్రేమించారో.. ఆ పార్టీయే.. వైఎస్‌ఆర్ చనిపోయాక.. ఆయన కుటుంబాన్ని ఒంటరి చేసింది. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయకపోయినా పర్వాలేదు కానీ.. ఆయన్ను అవమానించింది. వైఎస్ కుటుంబాన్ని చిన్న చూపు చూసింది. అంతే కాదు.. జగన్‌ను పార్టీ హైకమాండ్ బెదిరించింది.. అదిలించింది.. జగన్ వినలేదు. కదల్లేదు. ఢిల్లీలో తన గోడు వినిపించాలని.. దానికి ఓ ప్లాట్‌ఫాం కావాలని.. పార్టీ పెట్టాడు. హైకమాండ్‌కు సవాల్ విసిరాడు.

దీంతో జగన్ పై లేనిపోని కేసులు.. లక్షల కోట్ల అక్రమాస్తులంటూ ఆయన్ను జైలులో వేశారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. అయినప్పటికీ.. తన దైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. జైలు జీవితం తననేమీ కుంగదీయలేదు. మరింత కసితో ముందుకు కదిలాడు. ఓదార్పు యాత్ర చేశాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించాడు. వాళ్లను అక్కున చేర్చుకున్నాడు. వాళ్లకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. ఇవన్నీ చేస్తున్నా.. ఆయనలో ఉన్న ఒకే ఒక కోరిక.. అదే ఏపీకి ముఖ్యమంత్రి కావడం. ఆ సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపించేది.

ఇలాంటి ఎన్నో ఒడిదొడుకుల మధ్య 2014 లో ఏపీలో పోటీకి దిగాడు. కానీ.. ఒక్క జగన్ ను గద్దె ఎక్కనీయకుండా చేసేందుకు చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్.. ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి జగన్ ను ఓడించగలిగారు. అయినప్పటికీ.. టీడీపీ కూటమికి, వైఎస్సార్సీపీ ఓట్ల మధ్య తేడా చాలా స్వల్పం. చాలా కుంగిపోయాడు.. అయినప్పటికీ దైర్యం మాత్రం చావలేదు. ఇంకాస్త కసిగా ప్రయత్నించడం మొదలు పెట్టాడు.

2019 ని టార్గెట్ చేశాడు. 2019 లో ఖచ్చితంగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని సంకల్పించుకున్నాడు. ఒకసారి తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రి బాటలో నడవాలనుకున్నాడు. పాదయాత్ర ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేశాడు. 341 రోజులు… 3648 కిలోమీటర్లు నడిచాడు. ఒక్కడే.. తన వెనుక లక్షలాది జనం.. తనకు భరోసానిచ్చారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాడు. వాళ్ల కష్టాలను తెలుసుకున్నాడు. 2 కోట్ల మందిని నేరుగా కలిశాడు. వాళ్లతో మాట్లాడాడు. వాళ్లకు నేనున్నానంటూ ఓ కొడుకు ఆప్యాయతను పంచాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశాడు.

అదే జగన్ ను గెలిపించింది. పాదయాత్రలో ప్రజల్లో మమేకమై.. ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన జగన్ కు మేమున్నామంటూ ప్రజలు కూడా భరోసా ఇచ్చారు. అఖండ మెజారిటీతో గెలిపించాడు. ముఖ్యమంత్రిని చేశారు. ఈ విజయం దక్కడానికి జగన్.. 10 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. 10 ఏళ్ల పాటు ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టాలకు ఏనాడూ భయపడకుండా.. ఒంటరిగా పోరాటం చేసి చివరకు తను అనుకున్నది సాధించి.. గొప్ప వీరుడయ్యాడు జగన్.. జైహో.. జగన్. అందుకే.. ఆయన రాజకీయ ప్రస్థానం.. సక్సెస్ కోసం పరితపించేవాళ్లకు.. యువతకు ఒక పాఠం. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసి.. యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జగన్ ను ఒక ఇన్సిపిరేషన్ గా తీసుకొని.. యువత ముందుకు సాగితే.. ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news