నవంబర్ 25 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our COmmunity

 

నవంబర్‌- 25- కార్తీకమాసం- బుధవారం.

మేషరాశి:ఈరోజు శుభప్రదంగా ఉంటుంది !

మీ స్నేహితులు ఆర్థిక సహాయం కోరితే కచ్చితంగా చేయండి. మీరు మెరిట్ పొందుతారు. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్టం మద్దతు ఇస్తుంది. ఏదైనా కష్టమైన సమస్య పరిష్కారమవుతుంది. పెద్దలను సంప్రదించడం మంచిది.  మీరు ప్రయాణంలో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాతకు పశుగ్రాసం సమర్పిచండి.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు విజయాన్ని సాధిస్తారు !

ఈరోజు విజయాన్ని సాధిస్తారు. పోటీపరీక్షలలో విద్యార్థులు విజయం సాధింస్తారు. మీరు కష్టపడి పనిచేసి పట్టుదలతో ఉంటారు. పెట్టుబడి విషయాల్లో మీకు ప్రయోజనం లభిస్తుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను చదువండి.

 

మిధునరాశి:ఈరోజు కష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు !

ఈ రోజు ఇతరుల భావోద్వేగాలను గమనించుకోండి. ఈరోజు  కార్యాలయంలో మీరు కష్టమైన సమస్యను పరిష్కరించు కోగలుగుతారు. మీ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. గోచారరీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు. కష్టాలు భవిష్యత్‌ విజయానికి మార్గాలు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి,

 

కర్కాటకరాశి:ఈరోజు మీకు మంచి సమయం !

ఈ రోజు మీ ప్రతిభను చాటుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి. విజయం సాధించడానికి మీరు ఈ సమయంలో కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఇది మీకు మంచి సమయం. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి.  వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

సింహరాశి:ఈరోజు మిశ్రమఫలితాలు పొందుతారు !

ఈ రోజు ఆనందాన్ని నింపుతుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు వ్యాపారానికి సంబంధించి పెద్దల సలహాలను తీసుకోండి. మీరు ఈరోజు నూతన ఒప్పందంపై సంతకం చేయవచ్చు. ఈరోజు అనుకోని ప్రయోజనం పొందుతారు.

పరిహారాలుః శ్రీశివపంచాక్షరీ మంత్రాన్ని జపం చేయండి.

 

కన్యారాశి:ఈరోజు పనులను పూర్తిచేస్తారు !

గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు విజయం సాధిస్తారు. ఈ రోజు పని భారం పెరుగుతుంది. చాలా బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

 

తులారాశి:ఈరోజు బాకీలను చెల్లిస్తారు !

ఈ రోజు గతంలో చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తారు. ఈరోజు పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈరోజు షాపింగ్ చేయవచ్చు. డబ్బుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ పనిలో ఉపయోగపడని వాటిని కొనుగోలు చేయకండి. మీ సమయాన్ని పాడు చేస్తుంది. మీకు ప్రయోజనం కలిగించదు. మీ ఆలోచనలు ఇష్టపడతారు.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు తీరిక లేకుండా గడుపుతారు !

మొదటి భాగంలో ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశముంది. ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. మీరు పనిలో వత్తిడి ఉంటుంది. మీరు రుణం అడిగితే మీ పొదుపులను చూడాలి. అధిక వ్యయం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులను ఎదురుకొంటారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతిని ఆరాధించండి.

 

ధనుస్సురాశి :ఈరోజు మనస్సు కలత చెందుతుంది !

సృజనాత్మకతో ఈరోజు పనిచేయండి. ఇంట్లో పెద్దలతో వాదించకండి. ఈ రోజు ఎంచుకున్న రంగంలో నూతన బాధ్యతలను తీసుకునే అవకాశం. కొన్ని కారణాల వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. సంతానం వల్ల సంతోషం పొందుతారు. వైవాహిక జీవితంలో అనుకోని ఒడిదుడుకులు. కానీ చివరకు అన్ని సర్దుకుంటాయి.

పరిహారాలుః అనుకూలమైన ఫలితాల కోసం మృత్యంజయ జపం చేయడం మంచిది.

 

మకరరాశి:ఈ రోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.

ఈరోజు ఉద్యోగపరంగా విజయం సాధింస్తారు. మీలో నూతన శక్తి ఉంటుంది. ఈ రోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి, మాట్లాడేందుకు ఇది ఉత్తమ సమయం. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శుభ ఫలితాల కొరకు రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి,

కుంభరాశి  :ఈరోజు మీ పనిని శ్రద్ధగా చేయండి !

మీరు మీ పనిని శ్రద్ధగా చేయండి. ఇప్పుడు మీరు చేసిన కృషి వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం లభిస్తుంది. అనవసర ఖర్చులు చేయవద్దు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు వచ్చినప్పటికీ చివరకు అనుకున్నది పూర్తి చేస్తారు. ఈ రోజు అనుభవం సంపాదిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయండి.

 

మీనరాశి:ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు!

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సొంత వ్యాపారాన్ని కొనసాగించండి.  ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. విజయం మీకు చేరువలో ఉంది కష్టపడండి. మీకు మీ కుటుంబం పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. సంతానం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

పరిహారాలుః శివారాధన, సూర్యగ్రహారాధన చేయండి.

 

శ్రీ

 

 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news