రేపూ ఢిల్లీలోనే పవన్.. నేడు దక్కని దర్శనం ?

Join Our COmmunity

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన పవన్‌  తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కోరుతున్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తమకు ఓట్లు ఎక్కువ ఉన్నాయని జనసేన నేతలు లెక్కలు చెబుతున్నారు. ఇక రేపు కూడా ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక మంతనాలు జరపనున్నారు. బిజెపి అగ్రనాయకత్వం తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చలు కొనసాగుతున్నాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డాతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. బిజేపి, జనసేన సంయుక్త కార్యాచరణ పై సమాలోచనలు చేస్తున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలలో ఉభయ పార్టీ లు అనుసరించాల్సిన వ్యూహం పై ప్రధాన చర్చ జరుగుతోంది. రేపు కూడా మరికొంతమంది బిజేపి నేతలతో పవన్ కల్యాణ్ చర్చల జరపనున్నారు. జి.హెచ్.ఎమ్.సి ఎన్నికల ప్రచారం పై కూడా రెండు పార్టీ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు అంతా ప్రయత్నించినా అమిత్ షా దర్శనం మాత్రం దక్కేలేదని అంటున్నారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news