నవంబర్ 18-25 వరకు రాశి ఫలాలు: ఈ వారం కార్తీక పూజలతో అందరికీ మంచి ఫలితాలు!

-

horoscope

మేషరాశి: ఈ వారం అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు. వ్యవసాయదారులకు, వ్యాపారంలో ఉన్న వారికి లాభించే అవకాశం. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆవేశాలకు లోనుకారాదు. శ్రమ అధికంగా ఉంది. దైవబలంతో కార్యాలు సఫలీకృతం అవుతాయి. విఘ్న నివారణకు గణపతికి గరికతో పూజించండి. ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి. నిరంతరం ఇష్టదైవారాధనతో ముందుకు వెళ్లండి.

వృషభరాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. బంధువులతో సఖ్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు. కొన్ని గ్రహాల ప్రతికూలంగా ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతారాధనతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం లేదా శ్రవణం చేయండి. దగ్గర్లోని దేవాలయ సందర్శన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మిథునరాశి: ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. శుభవార్తా శ్రవణం. మంచి పనులతో ముందుకు వెళ్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది. దీర్ఘకాలిక కార్యాలకు అంత అనుకూలమైన కాలం కాదు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. గురుస్వరూప దేవాలయాలు సందర్శన, ఆయా దేవుళ్ల మంత్ర పఠనం, శ్రవణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కర్కాటకరాశి: ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు. ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమకు తగ్గ ఫలం లభిస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. కార్తీక దీపాలు, స్నానాలు, అభిషేకాలు మంచిచేస్తాయి.

సింహరాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అక్కడక్కడ చిన్నచిన్న విఘ్నాలు ఎదురైనా దైవబలంతో అధిగమిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత, సంతోషం ఉంటాయి. బంధువర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
కార్తీక దీపారాధన, విష్ణు, శివారాధన మంచి చేస్తుంది.

కన్యరాశి: పూర్తి అనుకూలమైన సమయం. కుటుంబం, బంధువర్గంతో సఖ్యత, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు. ఉద్యోగస్తులకు మిశ్రమ సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. శివా పూజలు, విష్ణుసహస్రనామ పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాలను ఇస్తుంది.

తులారాశి: ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ధనలాభం ఉంది. శుభకార్య సూచన. కుటుంబంలో సఖ్యత. బంధువర్గంతో విబేధాలు ఉన్నాయి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు మిశ్రమం. దీర్ఘకాలిక పనులు, పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దేవీ సంబంధిత దేవాలయ దర్శనం. కార్తీక స్నానాలు, దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తాయి.

వృశ్చికరాశి: మిశ్రమ ఫలితాలు. ఐనవారి సహాయ, సహకారాలు అందుతాయి.
కుటుంబంలో సఖ్యత. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రతిమాటను ఆలోచించి మాట్లాడాలి. కొన్ని గ్రహాల ప్రతికూలతవల్ల కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. బంధువర్గంతో అననుకూలత. కార్యసిద్ధి కోసం కార్తీక పూజలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం, ధ్యానం, శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సురాశి: ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కొన్ని చిన్న సమస్యలు వచ్చినా దైవబలంతో, ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. సహనంతో వ్యవహరించండి. నిరంతరం దైవనామ స్మరణతో విజయాలు చేకురుతాయి. కుటుంబ సఖ్యత. బంధువర్గంతో అనుకూల వాతావరణం. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు. కార్తీక పూజలు, దేవాలయ సందర్శన, దానధర్మాలు మిముల్ని రక్షిస్తాయి.

మకరరాశి: ఈ వారం అనుకూలం. చేసే ప్రయత్నాలు నిజాయతీతో చేయాలి. ఉద్యోగస్తులకు అనుకూలం. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలం. మనసు ఒక పట్టాన నిలవదు. చేసే పనులపై దృష్టి పెట్టండి. కుటుంబంలో చికాకులు. బంధువర్గంతో మిశ్రమ సంబంధం. సమస్యల నివారణకు హనుమాన్‌చాలీసా పారాయణం, కార్తీక దీపారాధన, వీలైతే శైవ క్షేత్రాలు సందర్శించండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి: ఈ వారం అనుకూలం. ఆర్థికంగా బాగుటుంది. కుటుంబంలో సఖ్యత. వ్యాపార రంగంలో వారికి అనుకూల వాతావరణం. ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది. నిదానంగా ఉండాలి. తొందరపడి మాట్లాడవద్దు.
బంధువర్గంతో అనుకూలత ఉండదు. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండవు. గతంలో మీరుచేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు మీరు విజయాలు సాధిస్తారు. దైవక్షేత్ర సందర్శన, దానధర్మాలు, కార్తీక పూజాభిషేకాల వల్ల మంచి జరుగుతుంది.

మీనరాశి: గ్రహసంచారం కలిసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది. గతంలో ప్రారంభించి పూర్తికాని పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. బంధువర్గంతో విబేధాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. పనులు పూర్తి కావడానికి గణేష పంచరత్నం, గరికతో పూజ చేయండి. వివాదాల నివారణకు స్థితికారకుడైన విష్ణుమూర్తిని పూజించండి. దానధర్మాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

నోట్: అన్ని రాశుల వారు ఈ వారంలో వచ్చే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి తిథులలో శాస్త్రం చెప్పిన పూజలు, దానధర్మాలు చేయండి. ఏడాదంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా పవిత్రమైన మాసం కావడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. తప్పక కార్తీక స్నానాలు, దీపారాధన, ఉసిరి, తులసి పూజలు, గోపూజ, అభిషేకాలు, విష్ణుసహస్రనామ పారాయణం తప్పక చేయండి.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news