గ్యాస్ సిలిండర్‌కు మంటలంటుకున్నా రియల్ హీరోలా వచ్చి.. వీడియో

-

cylinder blast in tea stall video goes viral

ఓ వీడియో… సోషల్ మీడియాలో వైరలయింది. ఏంటి.. ఆ వీడియో స్పెషాలిటీ అంటే.. టీకొట్టు దగ్గర ఓ సిలిండర్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో అంతా అక్కడి నుంచి పారిపోయారు. సిలిండర్ ఎక్కడ పేలుతుందోనని భయపడ్డారు. మంటలు ఎక్కువవుతున్నాయి. కొంతమంది డేర్ చేసి మంటలపై నీళ్లు పోయడం, దగ్గర్లోని ఇసుకను తీసుకొచ్చి పోయడం చేస్తున్నారు. అయినప్పటికీ మంటలు రెచ్చిపోతున్నాయి కానీ ఆగట్లేదు. స్థానికులంతా ఊపిరి బిగపట్టుకొని చూస్తున్నారు.. ఏం జరుగుతుందా అని. ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలితే.. ఎట్లా అని అక్కడివారు భయపడుతుండగానే రెడ్ టీషర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి మంటల దగ్గరికి వెళ్లాడు. మంటలకు పక్కన ఉన్న వస్తువులను దూరంగా విసిరేయడం ప్రారంభించాడు. ఇంతలోనే బ్లాక్ టీషర్ట్ వేసుకొని ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి మంటలంటుకున్న గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆపేశాడు. అంతే.. వెంటనే మంటలు ఆగిపోయాయి. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని రియల్ హీరో అంటూ పొగిడారు. ఇక.. నెటిజన్లయితే.. ఆ వ్యక్తికి అశోక చక్ర అవార్డు ఇవ్వాలని.. నేషనల్ హీరో అవార్డు ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news