తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 117 మంది సభ్యులను ప్రకటించిన తెరాస…. మిగిలిన రెండు సీట్లకు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెరాసలో పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఎప్పటినుంచో ముషీరాబాద్ నియోజకవర్గం తనకు సంబంధించిన వారికి కేటాయించాలని నాయిని సీఎంని కోరగా… నేడు తుది నిర్ణయం తీసుకున్నారు. ముషిరాబాద్కి నాయిని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. కేసీఆర్ తన సర్వే ప్రకారం ప్రజాధరణ గల నాయకుడైన… ముఠా గోపాల్ కి టికెట్ కేటాయించారు.
మరొక కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ కు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో మొత్తం 119 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ముఠా గోపాల్, మల్లయ్య యాదవ్ లు ఆయా నియోజకవర్గాల్లో రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నాయిని ప్రయత్నం కంటే చివరి క్షణంలో అంటే..రెండు రోజుల క్రితం తెరాసలో చేరిన మల్లయ్య యాదవ్ ప్రయత్నం ఫలించింది.