నవంబర్ 24 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our COmmunity

నవంబర్‌- 24- కార్తీకమాసం-మంగళవారం.

మేషరాశి: ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది !

ఎవరైనా ఆర్ధిక సాయం కోరితే తప్పక చేయండి. నేడు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈరోజు శుభంగా ఉంటుంది. కష్టమైన సమస్యలు పరిష్కృతమవుతాయి. అవసరం ఐతే, పెద్దలను సంప్రదించండి. ఈరోజు ప్రయాణం మీకు అనుకూల ఫలితాలను తీసుకొస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీకుజగ్రహ స్తోత్రం చదవండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు !

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీరు కష్టపడి పని చేస్తారు. పట్టుదలతో అడ్డంకులు ఎదుర్కొంటారు. భవిష్యత్ లో మీరు విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.

పరిహారాలుః ఎర్రటి పూలతో శివపూజ చేయండి.

 

మిధునరాశి

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు మీ పక్క వారి భావోద్వేగాల గురించి ఆలోచించండి. ఈరోజు మీరు పక్కన వారు చెప్పే విషయాలను వినడానికి ప్రయత్నించండి. పిల్లలు మీకు ఆనందకారకులు కాగలరు. ప్రయాణం మంచి ఫలితాన్నిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీగణపతికి అభిషేకం చేయించండి.

 

కర్కాటకరాశి: ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాల అవకాశాలు లభిస్తాయి. అయితే ఆ అవకాశాలను గుర్తించి,  వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

 

సింహరాశి: ఈరోజు మీకు అనుకూలం గా ఉంటుంది.

మీరు చర్చల్లో ఒకరిని గెలిపించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి మీరు ఓ వ్యక్తి ని కలుస్తారు. ఈరోజు మీకు అనుకూలం గా ఉంటుంది. కొత్త ఒప్పందాలపై మీరు సంతకం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీశివకవచం పారాయణం చేయండి.

 

కన్యరాశి: ఈరోజు మీకు సంతోషం గా గడుస్తుంది !

వ్యాపారానికి సంబంధించి రిస్క్ లు తీసుకోవద్దు. ఈరోజు మీకు సంతోషం గా గడుస్తుంది. ఈరోజు మీ పై ఎక్కువ బాధ్యతలు పడతాయి. వాటిని మీరే మోయాల్సి ఉంటుంది. అయితే, ఎన్ని ఆటంకాలు మొదలైన మొదలు పెట్టిన పనులను పూర్తి చేయడం లో మీరు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సాధిస్తుంది.

పరిహారాలుః నవగ్రహా ఆరాధన చేయండి.

 

తులరాశి: ఈరోజు అనుకోని ప్రయాణాలు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. గతం లో మీరు చేసిన రుణాలను చెల్లిస్తారు. షాపింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు చేయకండి. సంతానం కోసం ఖర్చులు పెడుతారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

 

వృశ్చికరాశి: ఈరోజు అధిక వ్యయం చేస్తారు !

ఈరోజు ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. మీరు పనుల్లో నిమగ్నం అయిపోతారు. అనుకోకుండా పాత స్నేహితుడిని ఒకరిని కలుస్తారు. అధిక వ్యయం  చేస్తారు. దీనికారణం గా మీరు ఇబ్బందులలో పడతారు. వైవాహిక జీవితం సాఫీగా బాగుంటుంది.

పరిహారాలుః శివుడికి తేనేతో అభిషేకం చేయండి.

 

ధనుస్సురాశి: ఈరోజు వాదనలకు దూరంగా ఉండండి !

కొన్ని కారణాల వలన మీ మనసు ప్రశాంతతను కోల్పోతుంది.  మీరు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు షాపింగ్ చేస్తారు. ఇంట్లో పెద్దలతో వాదించడం మంచిది కాదు. వాదనల వల్ల విబేధాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం చేయించండి. మీకు అనుకూల ఫలితాలు వస్తాయి.

 

మకరరాశి

మీ మనస్సుని సంతోషం గా ఉంచుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో మీరు ఉత్సాహవంతంగా ఉంటారు. ఉద్యోగపరంగా కూడా మీరు పురోగతిని సాధిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కుంభరాశి

ఈరోజు జరిగే సంఘటనలతో అపారమైన అనుభవం సాధిస్తారు. మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి. ఇపుడు మీరు పడుతున్న శ్రమ, భవిష్యత్ లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. ఈరోజు మీకు డబ్బు లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః పంచామృతాలతో శివాభిషేకం చేయండి.

 

మీనరాశి: ఈరోజు ఆనందగా గడుపుతారు !

ప్రత్యర్థి విమర్శలను పట్టించుకోకండి. మీ సొంత వ్యాపారాన్ని కొనసాగించండి. ఈరోజు ఆనందం గా గడుపుతారు. సమాజంలో ప్రజలతో మీరు అనుబంధాన్ని పెంచుకోగలుగుతారు. మనసు మీకు పూర్తి గా మద్దతు ఇస్తుంది. మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః సాయంత్రం వేళలో శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

-శ్రీ

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news