వదలని నిమ్మగడ్డ… సీ ఎస్ కు మరో లేఖ..

Join Our Community
follow manalokam on social media

ఎలా అయినా ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని  ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎస్‌ నీలం సాహ్నీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జత చేసి నిమ్మగడ్డ పంపించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని లేఖలో ఎస్ఈసీ ప్రస్తావించారు.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్టు లేఖలో మరోసారి స్పష్టం చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే ఎన్నికలు నిర్వహిస్తానని, అందుకు అధికారులతో సమావేశం అవుతానని రెండు సార్లు ఆయన యత్నించగా రెండు సార్లు ఆయనకు ప్రభుత్వం నుండి సహాయ నిరాకరనే ఎదురయింది. అందుకే ఈసారి ఆయన లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లేఖకు వచ్చే సమాధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తారో చూడాలి మరి. 

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...