శోభక్రుత్ నామ సంవత్సరం రాశిఫలం..!

-

శోభక్రుత్ నామ సంవత్సరం ఇది. ఈరోజు నుండి కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఉగాది నాడు ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణాన్ని చెప్పించుకుంటారు ఈ ఏడాది వాళ్ళకి ఎలా ఉంది… ఏ విధంగా కలిసి వస్తుంది… ఎలాంటి మంచి జరుగుతుంది అనేది తెలుసుకుంటారు. మరి ఈ సంవత్సరం మీ రాశి ఎలా ఉంది… ఏ ఏ మంచి పనులకి మీరు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను ఇప్పుడే చూసేయండి.

మేష రాశి:

మేష రాశి వాళ్లు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వాళ్ళకి భూ గృహ యోగాలు ఉంటాయి. గురు శ్లోకం చదువుకుంటే మంచిది. వ్యాపారులకి కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి ఉంది.

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1

వృషభ రాశి:

వృషభ రాశి వాళ్ళకి కూడా ఈ ఏడాది బాగానే ఉంది. అయితే ఉద్యోగపరమైన ఆటంకాలు రావచ్చు ఉద్యోగులకు వ్యాపారులకి కలిసి వస్తుంది. విదేశాల్లో అవకాశాలు కూడా పెరుగుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

ఆదాయం 14 వ్యయం 11 రాజపూజం 6 అవమానం 1

మిధున రాశి:

మిధున రాశి వాళ్ళకి గృహ భూవాహన యోగాలు సిద్ధిస్తాయి. విదేశాల్లో కూడా అవకాశాలు లభిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మిధున రాశి వాళ్ళు కష్టపడి పని చేయాలి ఇంట్లో శుభాలు కూడా జరుగుతాయి.

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజం 2, అవమానం 4

కర్కాటక రాశి:

Ugadi panchangam 2019 karkataka rashi Phalalu

విద్యార్థులు బాగా రాణిస్తారు. ఉద్యోగులకి వ్యాపారులకి కూడా బాగుంటుంది. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. శుభ ఫలితాలు పొందుతారు. నవంబర్ నుండి విఘ్నాలు కలగొచ్చు శని అష్టమంలో ఉంది కనుక మానసిక ఒత్తిడి ఉంటుంది.

ఆదాయం 11, వ్యయం 8, రాజపూజం 5, అవమానం 4

సింహరాశి:

Ugadi panchangam 2019 Singh rashi rashi Phalalu

సింహ రాశి వాళ్లు ధన యోగాన్ని పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి ఆస్తిని వృద్ధి చేస్తారు సింహ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి భాగస్వామితో గొడవలు వస్తాయి. సర్దుకుపోతే మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజం 1, అవమానం 7

కన్య రాశి:

కన్య రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి ఈ రాశి వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. పనుల వాయిదా వేయకండి. వ్యాపారం బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకు కూడా మంచిదే. విద్యాపరంగా శుభ ఫలితాలను అందుకుంటారు.

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7

తులా రాశి:

తులా రాశి వాళ్ళకి వ్యాపారంలో లాభాలు వస్తాయి. అదృష్ట యోగం 50 శాతం బాగుంది. విద్యలో కూడా రాణిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచనలో స్పష్టత లోపించకుండా చూసుకోండి. అక్టోబర్ 31 తర్వాత ఉత్సాహం తగ్గే అవకాశం ఉంటుంది.

ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7

వృశ్చిక రాశి:

ఆరోగ్యం బాగుంటుంది. మొహమాటం వలన ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. శాంతి ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత ఉండదు.

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి గృహ వాతావరణం ప్రశాంతతను ఇస్తుంది. పెద్దలని బాగా మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగం బాగుంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు బాగుంటుంది.

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం మూడు

మకర రాశి:

మకర రాశి వాళ్ళకి ఈ ఏడాది కలిసి వస్తుంది నవంబర్ నుండి మంచి ఫలితాలు ఉంటాయి పట్టుదలతో పని చేయండి. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమానురాగాలతో నడుచుకోండి .మనోబలంతో లక్ష్యాలని సాధించాలి.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6

కుంభరాశి:

ఈ రాశి వాళ్ళకి ధన లాభం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలతో మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఏప్రిల్ వరకు ఎదుగుదలకు అనుకూలంగా ఉంది.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 5, అవమానం 6

మీన రాశి:

విదేశీ ప్రయాణాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కొంచెం శ్రమిస్తే తప్పక విజయాన్ని అందుకోగలరు.

ఆదాయం 8, వ్యాయామం 11, రాజపూజం 1, అవమానం 2

Read more RELATED
Recommended to you

Latest news