ఇలా చేస్తే తప్పక బుధ గ్రహదోషాలు పోతాయి !

-

నవగ్రహాలలో ఒక్కో గ్రహాన్నికి ఒక్కో తత్వం. బుధగ్రహం..వ్యాపారం, ధనం, విద్య, బుద్ధి వంటి అనేక కారకాలకు ఆయన అనుగ్రహం తప్పనిసరి. అయితే బుధగ్రహదోషం ఉన్నవారు అనుభవంతో పలువురు పండితులు చెప్పిన ఈ కింది పరిహారాలు చేసుకుంటే తప్పక బుధ అనుగ్రహం కలుగుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం…

17 బుధవారములు నవగ్రహములకు 170 ప్రదక్షిణలు చేసి 1.25 కే.జీ. పెసలు దానము చేయండి. లేదా మీ దగ్గరలో నున్న విష్ణుమూర్తి దేవాలయమునకు వెళ్ళి ప్రతి బుధవారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకూ 170 ప్రదక్షిణలు చేయండి. లేదా తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ దేవస్థానమునకు వెళ్ళి జగన్మోహిని స్వామిని ఒక బుధవారం దర్శించి అష్టోత్తర పూజ చేయించుకుంటే మంచిది. బుధవారం రోజున పేదలకు పెసర హల్వా పంచిపెడితే మంచిది.

నరసింహ క్షేత్రములుగాని, విష్ణుమూర్తి క్షేత్రములుగాని దర్శించినప్పుడు పెసలు ఆకుపచ్చ వస్త్రములో దానము చేయండి. కుడిచేతి వేలికి పచ్చ జాతిరత్నంతో బంగారపు ఉంగరం చేయించి పెట్టుకోండి. బుధగ్రహ జపము బ్రాహ్మణుడితో చేయించి పెసలు దానము చేయించండి. నవగ్రహములలో బుధగ్రహమువద్ద బుధవారం 17 ఆకువచ్చ దారముల ఒత్తులతో దీపారాధన చేసి, ఆకుపచ్చ వస్త్రాన్ని దానము చేయండి. 17 బుధవారములు ఉపవాసము వుండి చివరి బుధవారము విష్ణుమూర్తి పూజ మరియు బుధుని అష్టోత్తర పూజ చేయండి. తమిళనాడులోని తిరువెంగకాడు దేవస్థానము దర్శించండి. విష్ణుమూర్తి, గణపతి, నరసింహ ఆలయము నందు పేదలకు, సాధువులకు బుధవారము ప్రసాదాలు పంచి, అన్నదానము చేయండి. బుధ ధ్యాస శ్లోకమును ప్రతిరోజు 170 మార్లు చొప్పున 170 రాజులు పారాయణ చేయండి.

బుధ గాయత్రి మంత్రమును 17 బుధవారములు 170 మార్లు పారాయణ చేయండి. బుధ మంత్రమును 40 రోజులలో 17,000 మార్లు జపము చేయండి. ప్రతి రోజు విష్ణుసహస్ర నామ స్తోత్రము పారాయణ చేయండి.. తీరిక లేనివారు కనీసము బుధ శ్లోకము 17 మార్లుగాని, బుధ మంత్రమును 17 మార్లు పారాయణ చేయండి.. ఏకాదశి పర్వదినమున విష్ణు సహస్రనామ స్తోత్రమును 3 మార్లు పారాయణ చేయండి. ఇలా ఎవరికి వీలైనది వారు భక్తితో విశ్వాసంతో వారివారి ఇష్టదేవతలను పూజించి పైన చెప్పిన ఏదో ఒక రెమిడీ చేస్తే చాలు. బుధగ్రహదోషాలు పోతాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news