కోవిడ్ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలను తీసుకున్నవారికి జీవితకాలం పాటు రక్షణ లభిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సదరు వ్యాక్సిన్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన యాంటీ బాడీలు తయారవుతాయి, కొత్త రకమైన ట్రెయినింగ్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేసుకుంటాయని, ఈ క్రమంలో టి-సెల్స్‌ను యాంటీ బాడీలు నాశనం చేస్తాయని, అలాగే కోవిడ్ నూతన స్ట్రెయిన్లను కూడా చంపేస్తాయని.. వెల్లడైంది. ఈ మేరకు యూకేకు చెందిన ది సన్ వెల్లడించింది.
సదరు వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల జీవితాంతం కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. ఈ క్రమంలో ఎప్పుడంటే అప్పుడు శరీరంలో యాంటీ బాడీలు తయారై వైరస్‌ల నుంచి రక్షణను అందిస్తాయి. ఆక్స్‌ఫర్డ్ తోపాటు స్విట్జర్లాండ్‌కు చెందిన కొందరు సైంటిస్టులు నేచర్ అనే జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. టి-సెల్ రక్షణ అనేది కీలకం అని అన్నారు. ఆక్స్‌ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల ద్వారా అది లభిస్తుందన్నారు.
నివేదిక చెబుతున్న ప్రకారం.. సెల్యులార్ ట్రెయినింగ్ క్యాంప్స్ నుంచి వచ్చే టి-సెల్స్ అత్యధిక స్థాయిలో ఫిట్‌నెస్‌ను కలిగి ఉంటాయని స్విట్లర్లాండ్‌కు చెందిన కంటోనల్ హాస్పిటల్ పరిశోధకుడు బర్ఖార్డ్ లుడెవిగ్ తెలిపారు. మనుషులతోపాటు ఎడినో వైరస్‌లు ఎంతో కాలం నుంచి మార్పులకు లోనవుతున్నాయని, మనిషి రోగ నిరోధక వ్యవస్థ గురించి అవి చాలా విషయాలను తెలుసుకున్నాయన్నారు.
వైరస్ లు అనేవి ఉత్తమ టీచర్లు అని, అవి మనకు ఎంతో ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయని అన్నారు. అయితే వాటి నుంచి నేర్చుకున్న విషయాల వల్లే మనం టీబీ, హెపటైటిస్ సి వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తయారు చేయగలిగామని అన్నారు.