మామిడి పండ్లను తినాలంటేనే డయాబెటిస్ ఉన్నవారు భయపడుతుంటారు. వాటిల్లో షుగర్ అధికంగా ఉంటుంది కనుక వాటిని తింటే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనని ఆందోళన చెందుతారు. అందుకనే చాలా మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినరు. అయితే ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే లక్నోలోని Central Institute for Subtropical Horticulture (CISH) కు చెందిన సైంటిస్టులు కొందరు నూతన రకం మామిడి పండ్లను అభివృద్ది చేశారు. వాటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు కదా, తగ్గుతాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించే శక్తి కూడా వాటికి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.
CISH సైంటిస్టులు వృద్ధి చేసిన మామిడి పండ్లలో అత్యధిక స్థాయిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఈ మామిడి పండ్లలో ఉంటాయి. అందుకనే ఈ మామిడి పండ్లను తింటే డయాబెటిస్ తగ్గడమే కాక క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
ఇక ఈ మామిడి పండ్లపై ఆ సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఈ పండ్లు మనకు మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. మామిడి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక డయాబెటిస్ ఉన్నవారు వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఈ కొత్త రకం పండ్లను వారు నిర్భయంగా తినవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఈ పండ్లలోనే అధికంగా ఉంటాయి. అందువల్లే ఈ పండ్లను తింటే డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక ఈ పండ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి.