చంద్రుడిపై నీటి ఆనవాళ్లు గుర్తించిన చైనా పరిశోధకులు

-

చాంగే-5 మిషన్‌ ద్వారా చైనా అరుదైన విషయాన్ని కనుగొంది. చంద్రుడి అన్వేషణలో భాగంగా చాంగే-5 అంతరిక్ష నౌకతో జాబిల్లిపై ఉన్న మట్టిని చైనా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మట్టిపై డ్రాగన్ దేశం నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ పరిశోధనల్లో పురోగతి సాధించింది. జాబిల్లి మట్టిలో నీటి జాడలను గుర్తించినట్లు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది.

చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చాంగే-5 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడి నుంచి 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకు రాగా.. వాటిపై బీజింగ్‌ నేషనల్‌ లేబొరేటరీ ఫర్‌ కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫిజిక్స్‌ పరిశోధకులు నాలుగేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అలా ఎట్టకేలకు తాజాగా ఈ మట్టి నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు గుర్తించారు.

మరోవైపు జాబిల్లిపై పరిశోధనలో భాగంగా ఇద్దరు అమెరికా వ్యోమగాములు 40 ఏళ్ల క్రితమే చంద్రునిపైకి వెళ్లి నమూనాలను సేకరించారు. 1976లో సోవియట్‌ యూనియన్‌ కూడా చంద్రుడి మట్టి నమూనాలను తీసుకురాగా.. జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news