చంద్రయాన్ 3కి సిద్ధమవుతున్న ఇస్రో.. 2020 నవంబర్‌లో ప్రయోగం..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2020 నవంబర్‌లో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మరోసారి చంద్రయాన్ 2 లాగానే సాఫ్ట్-ల్యాండ్ మిషన్‌ను ఇస్రో చేపట్టనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2020 నవంబర్‌లో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. గత సెప్టెంబర్ 7వ తేదీన చంద్రయాన్ 2కు, విక్రమ్ ల్యాండర్‌కు మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఆ ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది మరోసారి చంద్రయాన్ 2 లాగానే సాఫ్ట్-ల్యాండ్ మిషన్‌ను ఇస్రో చేపట్టనుంది. అందుకుగాను ఇప్పటి నుంచే ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది.

isro to launch chandrayaan 3 2020 november

కాగా చంద్రయాన్ 2 ఆర్బిటార్ ఇప్పటికే కక్ష్యలో పరిభ్రమిస్తున్నందున చంద్రయాన్ 3లో ఆర్బిటార్‌ను పంపే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం ల్యాండర్, రోవర్‌లను మాత్రమే చంద్రయాన్ 3లో పంపుతారని సమాచారం. కక్ష్యలోకి వెళ్లగానే చంద్రయాన్ 3 లోని ల్యాండర్, రోవర్‌లు చంద్రయాన్ 2తో అనుసంధామై పనిచేస్తాయని తెలుస్తోంది. ఇక చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3 బరువు కొంత వరకు తగ్గుతుందని కూడా తెలిసింది.

ఇక చంద్రయాన్ 3ని 2020 నవంబర్ నెలలో కచ్చితంగా ఏ తేదీన ప్రయోగిస్తారో ఇస్రో వివరాలను వెల్లడించలేదు. కానీ త్వరలోనే ఆ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.