ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. 3జీ సేవల నిలిపివేత..

-

ప్రముఖ దిగ్గజ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. జియో నుంచి పోటీని తట్టుకోలేపోతున్న ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయితే, 2జీ సేవల విషయంలో మాత్రం ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. 2జీ నెట్‌వర్క్ నుంచి ఆదాయం వస్తున్నంత కాలం వాటి సేవలు కొనసాగుతాయిని స్పష్టం చేశారు. అలాగే, 2జీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొస్తూనే ఉంటామని వివరించారు.

కాగా, కోల్‌కతా, హర్యానాలో ఎయిర్‌టెల్ ఇప్పటికే 3జీ సేవలకు స్వస్తి పలికింది. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో 2జీ, 4జీ సేవలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 3జీ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్టు సంస్థ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news