‘ఆండ్రాయిడ్ 10’ లో స్పెషాలిటీస్.. ఫైనల్‌ ఫీచర్స్‌ ఇవే..

-

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్‌ల‌కు తినుబండ‌రాల పేర్లు పెడుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. అయితే లేటెస్ట్‌గా ఈ ఆన‌వాయితీకి స్వ‌స్తి ప‌లికేసింది. త‌న లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ కు ‘ఆండ్రాయిడ్ 10’ పేరును ప్రకటించింది. అదే సమయంలో గూగుల్ ఈ ‘ఆండ్రాయిడ్ 10’ కు చెందిన బీటా 6 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసింది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఫైనల్ వెర్షన్ విడుదల చేయనుంది. ఈ ఆండ్రాయిడ్ 10లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.

Samsung Galaxy Note 10 Release

ఆండ్రాయిడ్ 10 ఫీచర్లు

– ఆండ్రాయిడ్ 10లో కొత్తగా బబుల్స్ సదుపాయం రానుంది. మ‌నం ఫోన్‌లోకి వ‌చ్చి ఓ అప్లికేష‌న్ ఓపెన్ చేశాక త‌ర్వాత హోమ్ స్క్రీన్‌కు వ‌చ్చినా మ‌నం ఓపెన్ చేసిన అప్లికేష‌న్ బబుల్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తోంది.

– ఇక మన స్మార్ట్ ఫోన్ లో యాప్స్ షార్ట్ కట్స్ పొరపాటున డిలీట్ అయిన ‘అన్ డూ’ అనే ఆప్షన్ ద్వారా వాటిని తిరిగి అదే ప్లేసులోకి తీరుకురావచ్చు.

– ఈ ఓస్ వ‌ల్ల సెట్టింగ్స్‌లో ప్రైవ‌సీ ఆప్ష‌న్ రానుంది. ఇందులో అన్నీ అప్లికేషన్లు లిస్ట్ చేసి ఉంటాయి. అందువల్ల మనకు అవసరమైన అప్లికేషన్ పర్మిషన్ ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు.

– ఈ ఓఎస్ వ‌ల్ల స్నేహితులకు వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకునే ఇబ్బందులు కూడా తప్పనున్నాయి. మామూలుగా హాట్ స్పాట్ ఆన్ చేసి వాళ్ళకి పాస్వర్డ్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్తితి లేకుండా వైఫైకి క్యూ‌ఆర్ కోడ్ తయారుచేసుకుని దాని ద్వారా నేరుగా వైఫైకి కనెక్ట్ అవ్వొచ్చు.

– ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంలో పూర్తిస్థాయిలో సిస్టం వైడ్‌ డార్క్‌మోడ్‌ అందించారు. దీన్ని వల్ల బ్యాటరీ ఆదా అవుతుంది. కళ్ల మీద ఒత్తిడి పడదు. అన్నీ అప్లికేషన్లు ఆటోమేటిక్ డార్క్ మోడ్ ని కలిగి ఉన్నాయి.

– స్మార్ట్ ఫోన్లలో ఉండే థీమింగ్ ఆప్షన్ ఇక నుంచి ఆండ్రాయిడ్ 10 కూడా అందించనుంది.

– ఈ ఓఎస్‌లో లోకేషన్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉంది. దీని వల్ల మన పర్మిషన్ లేకుండా ఏ అప్లికేషన్ లొకేషన్ యాక్సెస్ చేసుకోలేదు.

– ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంలో లైవ్‌ క్యాప్షన్ ఆప్ష‌న్ ఉంటుంది. ఇది ఇంటర్నెట్ తో పని లేకుండా ఏదైనా వీడియో,ఆడియో ఫైల్స్ ప్లే అవుతుంటే వాటి మాటలకు తగ్గట్టుగా లైవ్ క్యాప్షన్లు టెక్స్ట్ రూపంలో చూపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version