మూసి ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు – మంత్రి శ్రీధర్ బాబు

-

మూసి ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయాంలో 2017 లో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన పై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు శ్రీధర్ బాబు.

మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ను తెచ్చింది బిఆర్ఎస్ సర్కార్ అని.. మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా..? అంటూ నిలదీశారు. గతంలో బిఆర్ఎస్ నేతలు చేసిన పనులను మరిచిపోయినట్లు ఉన్నారని మండిపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు శ్రీధర్ బాబు. మూసీ నది ప్రక్షాళన పై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని.. యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలు తొలగించాలని నాటి సమావేశాలలో ఆదేశించారని గుర్తు చేశారు.

వారి లెక్క ప్రకారం 8,480 అక్రమ నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారని చెప్పుకొచ్చారు. కానీ అదంతా పేపర్లకే పరిమితమై మాటలతోనే కాలం గడిపారని మండిపడ్డారు. తాము మూసి నిర్వాసితులకు మరోచోట ఆవాసం కల్పిస్తున్నామని.. ఉపాధి కల్పించే చర్యలు కూడా చేపట్టామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version