ఈనెల 26 నుంచి యాపిల్‌ దివాళీ సేల్‌

-

యాపిల్ ప్రొడక్ట్స్.. ముఖ్యంగా ఐఫోన్ అంటే ఇష్టపడని వారుండరు. ఈ ఫోన్లని కొనడానికి కొందరు పడే తంటా అంతా ఇంతా కాదు. మరికొందరు ఆ మొబైల్ అంటే ఇష్టమున్నా బడ్జెట్ లేక వెనకడుగేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం యాపిల్ దివాళీ  సేల్ వస్తోంది. ఈ నెల 26 నుంచి ఈ సేల్ మొదలవుతుంది. సేల్‌లో భాగంగా యాపిల్‌ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌, ఐప్యాడ్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఇయర్‌ఫోన్లపై ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

సేల్‌లో భాగంగా ఏమేం ఆఫర్లు ఇస్తున్నదీ యాపిల్‌ వెల్లడించలేదు. అయితే, లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్లు, ఫ్రీగిఫ్ట్‌లు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించే అవకాశం ఉంది. గతేడాది, అంతకుముందు ఏడాది సైతం ఇదే విధంగా ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై కంపెనీ ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్‌ ఉచితంగా ఇచ్చింది. ఈ సారి కూడా ఇదే తరహాలో ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఐఫోన్‌ కొనుగోళ్లపై కార్డు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news