ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్.. కొత్త ఐప్యాడ్లను తాజాగా విడుదల చేసింది. సాధారణంగా యాపిల్ ఏదైనా ఒక ఈవెంట్‌ను నిర్వహించడం ద్వారా అందులో తన నూతన గ్యాడ్జెట్లను విడుదల చేస్తుంది. కానీ కరోనా నేపథ్యంలో ఎలాంటి ఈవెంట్లు లేకుండానే యాపిల్ కొత్త ఐప్యాడ్లను లాంచ్ చేసింది. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లు, వీటి ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఐప్యాడ్ ప్రొ 11 ఇంచ్/ 12.9 ఇంచ్ (2020) స్పెసిఫికేషన్లు…
* 11 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే, 2388 x 1668 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 12.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే, 2732 x 2048 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ఎ12జడ్ బయానిక్ ప్రాసెసర్, 128/256/512జీబీ/1టీబీ స్టోరేజ్
* ఐప్యాడ్ ఓఎస్ 13.4, 12, 10 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్‌టీఈ (ఆప్షనల్), వైఫై 6 (802.11ఏఎక్స్)
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 11 ఇంచ్ ఐప్యాడ్ ప్రొ – 28.65 వాట్ అవర్ బ్యాటరీ, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
* 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రొ – 36.71 వాట్ అవర్ బ్యాటరీ, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
ధర వివరాలు…
11 ఇంచుల ఐప్యాడ్ ప్రొ వైఫై మోడల్ ప్రారంభ ధర భారత్‌లో రూ.71,900 ఉండగా, వైఫై + సెల్యులార్ మోడల్ ప్రారంభ ధర రూ.85,900గా ఉంది. అలాగే 12.9 ఇంచుల ఐప్యాడ్ ప్రొ వైఫై మోడల్ ప్రారంభ ధర రూ.89,900 ఉండగా, వైఫై + సెల్యులార్ మోడల్ ప్రారంభ ధర రూ.1,03,900గా ఉంది. ఇక ఈ ఐప్యాడ్లకు గాను మ్యాజిక్ కీబోర్డు సదుపాయాన్ని అందిస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 11 ఇంచుల ఐప్యాడ్ ప్రొ మ్యాజిక్ కీ బోర్డు ధర రూ.27,900 ఉండగా, 12.9 ఇంచుల ఐప్యాడ్ ప్రొ మ్యాజిక్ కీబోర్డు ధర రూ.31,900 గా ఉంది. ఇక ఈ ఐప్యాడ్లకు యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐప్యాడ్లు అమెరికా మార్కెట్‌లో మాత్రమే లభిస్తుండగా, త్వరలోనే భారత్‌లోనూ వీటిని విక్రయించనున్నారు.