గుడ్ న్యూస్‌.. ఐఫోన్ 11, 12 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన యాపిల్..!

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కొత్త‌గా ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డంతో ఐఫోన్ 11, 12 మోడ‌ల్స్‌కు చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను యాపిల్ త‌గ్గించింది. ఈ క్ర‌మంలో త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. త‌గ్గిన ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

apple slashed iphone 11 and 12 phone prices

ఐఫోన్ 11కు చెందిన 64జీబీ మోడ‌ల్ ధర రూ.54,900 ఉండ‌గా ఈ ఫోన్ రూ.49,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.59,900 ఉండ‌గా, రూ.54,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే ఐఫోన్ 12కు చెందిన 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా ఈ ఫోన్ రూ.65,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

ఐఫోన్ 12కు చెందిన 128జీబీ మోడల్ ధ‌ర రూ.84,900 ఉండ‌గా, రూ.70,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.94,900 ఉండ‌గా, రూ.80,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఐఫోన్ 12 మీనీ 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.69,900 ఉండ‌గా, రూ.59,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.74,900 ఉండ‌గా, రూ.64,900 కు ల‌భిస్తోంది. అలాగే ఐఫోన్ 12 మినీ 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.84,900 ఉండ‌గా, రూ.74,900 ధ‌ర‌కు ల‌భిస్తోంది.