సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌కు చెందిన ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యం విషయంలో ఎంత పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తాయో అందరికీ తెలిసిందే. గతంలో చాలా మంది ఆపిల్ వాచ్ వల్ల తమకున్న గుండె సమస్యల గురించి ముందుగానే తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకుని ప్రాణాలు నిలుపుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వాకో అనే ప్రాంతానికి చెందిన ఓ 79 ఏళ్ల వ్యక్తి ఆట్రియల్ ఫైబ్రిలేషన్ సమస్యకు గురైనట్లు అతని చేతికున్న ఆపిల్ వాచ్ (సిరీస్ 4 వాచ్) అతని డాక్టర్ రే ఎమర్సన్‌కు మెసేజ్ పంపింది. దీంతో అలర్ట్ అయిన ఎమర్సన్ వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్‌కు రప్పించి అతనికి సర్జరీ చేసి ప్రాణాపాయం నుంచి తప్పించాడు.
ఆట్రియల్ ఫైబ్రిలేషన్ అంటే గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం అన్నమాట. అలాంటి స్థితిలో హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్ రాకముందే ఆ సమస్యను గుర్తించిన ఆపిల్ వాచ్ ఆ వ్యక్తికి చెందిన పర్సనల్ డాక్టర్‌కు ఆ సమస్యను తెలపడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన ప్రాణాలను నిలిపినందుకు గాను ఆపిల్ వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.