బ్రేకింగ్ : ఇక యాపిల్ ఫోన్ చార్జర్లు కొనుక్కోవడమే, కొత్త ఫోన్ కి ఇవ్వరు…!

-

ఆపిల్ త్వరలో ఐఫోన్ 12 సిరీస్ కింద నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మీడియాకు అందిన నివేదికల ప్రకారం బిల్ ఆఫ్ మెటీరియల్ వ్యయం కారణంగా ఊహించిన దానికంటే యాపిల్ కొత్త ఫోన్ ల ధరలు ఎక్కువగా ఉండవచ్చు. న్యూస్ ఏజెన్సీ ఐఎఎన్ఎస్ కోట్ చేసిన టెక్ పోర్టల్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం… 5 జి సపోర్ట్ చేసే ఐఫోన్ 12 ధరను గత సంవత్సరం మోడల్ మాదిరిగానే విక్రయించడం సాధ్యం కాదని చెప్పింది.

ఎందుకంటే ఈ సంవత్సరం బిల్ ఆఫ్ మెటీరియల్ ఖర్చు 50 డాలర్లు పెరిగిందని పేర్కొంది. ఐఫోన్ 12 బాక్స్‌లో ఛార్జర్ లేదా వైర్డ్ ఇయర్‌ఫోన్‌లతో రాదని, కొంత ఖర్చు ఆదా చేయడానికి ఆపిల్ 20W ఛార్జర్‌ను విడిగా విక్రయించవచ్చని కూడా తెలిపింది. ఇటీవల, ఆపిల్ ఇన్సైడర్ అయిన జోన్ ప్రాసెసర్, రాబోయే 5.4-అంగుళాల ఐఫోన్ 12 $ 649 నుండి ప్రారంభమవుతుందని, 6.1-అంగుళాల ఐఫోన్ 12 ధర 749 డాలర్లతో రావచ్చని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news