వాట్సాప్ రెండు ఫోన్స్ లో వాడొచ్చా…?

-

వాట్సాప్… ఈ రోజుల్లో ఈ పేరు వినకుండా జీవితం ముందుకు వెళ్ళే అవకాశం లేదు అనే మాట అక్షరాలా నిజం. వాట్సాప్ లేకుండా మన జీవితంలో ఏ ఒక్కటి కూడా జరిగే అవకాశం లేదు అనేది వాస్తవం. ప్రతీ రోజు కూడా వాట్సాప్ తన వినియోగ దారుల కోసం అప్డేట్ అవుతూ వస్తుంది. అయితే దీనిలో ఒక అసహనం ఉంది అభిమానులకు. దీనిని రెండు డివైజ్ లో ఒకేసారి వాడటం అనేది చాలా కష్టం.

దీనికి సంబంధించి గత ఏడాది పరిక్షలు జరిగినా సరే అందుబాటులోకి సంస్థ తీసుకుని రాలేదు. ఇప్పుడు మళ్ళీ దాని మీద పరిక్షలు చేస్తుంది సంస్థ. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనిపించిందని సమాచారం. వాట్సాప్‌ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు ఇంకో డివైజ్‌లో వాడటం అనేది సాధ్యం కాని వ్యవహారం. అందులో వాడితే ఇంకే ఫోన్ లో అది పని చేసే అవకాశం ఉండదు.

ఈ విషయంలో దీన్ని వాడే వారిలో కాస్త అసహనం ఉంది అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఒకే కాలంలో వాట్సాప్ ని వాడటానికి వాట్సాప్ వెబ్ మాత్రమే పని చేస్తుంది. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన పరిక్షలు పూర్తి కాగానే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక ఫోన్‌, టాబ్లెట్‌ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఇది బాగా ఉపయోగ౦ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news