ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు డెల్ భారత్‌లో కొత్తగా ఓ ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌పీఎస్ మోడల్‌లో విడుదల చేసింది. డెల్ ఎక్స్‌పీఎస్ 13 (9310) పేరిట ఆ ల్యాప్‌టాప్‌ను విడుదల చేశారు. ఇందులో యూజర్లకు 32 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇంటెల్ కోర్ 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ల్యాప్‌టాప్ అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తుంది. ఎక్స్‌పీఎస్13కు అప్‌గ్రేడెడ్ వేరియెంట్‌గా ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు. ప్లాటినం సిల్వర్, ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్ లభిస్తోంది.
డెల్ ఎక్స్‌పీఎస్ 13 మోడల్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 వేరియెంట్లలో లభిస్తోంది. ఐ5 ప్రాసెసర్ వేరియెంట్ ధర రూ.1,50,990 ఉండగా, ఐ7 వేరియెంట్ ధరను జనవరిలో వెల్లడిస్తారు. ఈ ల్యాప్‌టాప్‌ను డెల్ స్టోర్లతోపాటు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.
డెల్ ఎక్స్‌పీఎస్ 13 ల్యాప్‌టాప్‌లో 13 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. దీంట్లో యూజర్లకు 3840 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంది. ఈ ల్యాప్‌టాప్ టచ్, నాన్ టచ్ వేరియెంట్లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.19 కేజీలు. అందువల్ల చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఫుల్ చార్జింగ్ చేస్తే సుమారుగా 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.