ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల త‌యారీకి అయ్యే అస‌లు ఖ‌ర్చు తెలుసా ? షాక‌వుతారు !

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌గా వాటికి వినియోగ‌దారుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. 5జి ఫీచ‌ర్ ఉండ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక ఐఫోన్ 12 ఫోన్ ప్రారంభ ధ‌ర భార‌త్‌లో రూ.79,900 ఉండ‌గా, గ‌రిష్ట ధ‌ర రూ.94,900గా ఉంది. అలాగే ఐఫోన్ 12 ప్రొ ప్రారంభ ధ‌ర రూ.1,19,900 ఉండ‌గా గ‌రిష్ట ధ‌ర రూ.1,49,900 ఉంది. అయితే ఇంత భారీల‌ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ నిజానికి ఈ రెండు ఫోన్ల‌ను త‌యారు చేసేందుకు కేవ‌లం రూ.30వేలు మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంది. అవును.. మీరు న‌మ్మ‌కున్నా.. ఇది నిజ‌మే.

Do you know the actual cost of manufacturing the iPhone 12, 12 Pro phones? Be shocked!

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ల‌ను జ‌పాన్‌కు చెందిన ఫోమ‌ల్‌హౌ్ టెక్నో సొల్యూష‌న్స్ అనే కంపెనీ ఏపార్ట్‌కు ఆ పార్ట్ విడ‌దీసి వాటి విడి భాగాల ధ‌ర‌ల‌ను లెక్కించింది. దీంతో ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల త‌యారీకి అస‌లు ఎంత ఖ‌ర్చ‌వుతుందో వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో ఐఫోన్ 12 త‌యారీకి దాదాపుగా రూ.27,550, ఐఫోన్ 12 ప్రొ త‌యారీకి రూ.30వేలు ఖ‌ర్చవుతుంద‌ని తేలింది. ఆయా ఫోన్ల‌లోని విడిభాగాల ధ‌ర‌ల‌ను లెక్కించ‌డం వ‌ల్ల ఈ ధ‌ర‌లు వ‌చ్చాయి.

అయితే నిజానికి ఆ ఫోన్ల ధ‌ర‌ల‌కు ప‌న్నులు, మార్కెటింగ్‌, ప‌బ్లిసిటీ ఖ‌ర్చు, రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌.. వంటి చార్జిల‌ను క‌లిపితే మ‌న‌కు పైన తెలిపిన భారీ ధ‌ర‌కు యాపిల్ ఆ ఫోన్ల‌ను విక్ర‌యిస్తుంది. కానీ విడి భాగాల ధ‌ర‌ల‌‌ను లెక్కించ‌డం వల్ల వ‌చ్చింది కేవ‌లం ఆ ఫోన్ ధ‌రే. దానికి ముందు తెలిపిన చార్జిల‌న్నీ జ‌మ అవుతాయి. అందుక‌నే యాపిల్ ఐఫోన్ల ధ‌ర‌లు అంత ఎక్కువ‌గా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news