స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జ్‌ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్లు అందరి వద్ద ఉన్నవే. కరోనా నేపథ్యంలో వీటి వినియోగం మరింత పెరిగింది. కానీ, స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఛార్జింగ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌ను ఇష్టానుసారంగా ఛార్జింగ్‌ ( స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జ్‌ | Smart Phones Charging ) పెట్టకూడదు. అలా చేస్తే అది త్వరగా పాడవుతుంది. కొంత మందికి పగలుతోపాటు రాత్రి కూడా స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

 

Smart Phones Charging | స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జ్‌
Smart Phones Charging | స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జ్‌

ఇలా అయితే, ఫోన్‌ ఛార్జింజ్‌ త్వరగా అయిపోతుంది. కానీ, ఎప్పుడూ 100 శాతం ఛార్జ్‌ చేయకూడదు. కొంతమంది రాత్రి ఛార్జింగ్‌ పెట్టి, ఉదయం తీస్తారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఛార్జింగ్‌ కూడా కేవలం 80–90% శాతానికి ఛార్జింగ్‌ పెట్టాలి. ఇలా రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి పడుకోవడం వల్ల ఫోన్‌ వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఛార్జింగ్‌ కూడా 20 శాతం కంటే తక్కువగా ఉంటేనే ఛార్జింగ్‌ పెట్టాలి.

మరికొంత మంది ఛార్జింగ్‌ పెట్టి స్మార్ట్‌ ఫోన్‌ను వాడతారు. అలా చేస్తే బ్యాటరీ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఛార్జింగ్‌ పెట్టి గేమ్‌ ఆడుతూ, ఫోన్‌ మాట్లాడుతూ ఉంటారు. ఇది వరకు ఇలా చేయడం వల్ల కూడా ఫోన్లు పేలిపోయిన సందర్భలు కూడా ఉన్నాయి. అందుకే ఛార్జింగ్‌ పెట్టి ఏ పనులు చేయకూడదు. ఒక్కోసారి ఛార్జింగ్‌ అయిపోయాక ఫోన్‌ తీసేసి, ఛార్జర్‌ అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల కరెంట్‌ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది.