ట్విటర్ నుంచి దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించారు ఆ సంస్థ కొత్త బాస్ ఎలాన్ మస్క్. ప్రపంచ వ్యాప్తంగా మస్క్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ట్విటర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంపెనీ రూ.వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
‘‘ట్విటర్ రోజుకు 4 మిలియన డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు దురదృష్టవశాత్తూ సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదు. కంపెనీ నుంచి నిష్క్రమించిన ప్రతి ఉద్యోగికి మూడు నెలల వేతన చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50 శాతం ఎక్కువే’’ అని మస్క్ ట్వీట్ చేశారు.